ఈశాన్య భారతదేశం జూన్ నెల ఆరంభంలో నుంచే భారీ వర్షాల తాకిడితో విలవిలలాడుతోంది. అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాన్సూన్ ప్రభావంతో మట్టికరిపించే వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, వరదలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటి వరకు 34 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వంతెనలు, ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేలాది మంది నివాసాలు వదిలి రిలీఫ్ క్యాంపుల దిశగా తరలించబడ్డారు.
వైరల్ వీడియో: ప్రాణాల మీదకు తెచ్చుకున్న – కిరణ్ రిజిజు స్పందన
ఇలాంటి విపత్తు మధ్య, అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ యువకుడు ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటుతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు షేర్ చేశారు. రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు యత్నించాడు. ఈ వీడియో షేర్ చేస్తూ కిరణ్ రిజిజు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అవసరమైన సాయం అందిస్తున్నది చెప్పారు. నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అసోం రైఫిల్స్ రంగంలోకి
వర్షాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ చెప్పింది. మణిపూర్ సహా మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ చెప్పింది. ఎయిర్ ఫోర్స్, అసోం రైఫిల్స్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు . సిక్కింలోని తీస్తానదిలో టూరిస్ట్ బస్సు పడిపోయిన ఘటనలో గల్లంతయిన 8 మంది ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. మేఘాలయలో 10 జిల్లాల్లో 10వేల మంది వరదలతో ప్రభావితమయ్యారు. అసోంలో 19 జిల్లాల్లో 764 గ్రామాలు వరదలతో ప్రభావితమయ్యాయి. సిక్కింలో చిక్కుకున్న 1500 మంది టూరిస్టులను వారివారి ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కొనసాగుతోంది.
ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సహకరిస్తూ ఎమర్జెన్సీ సర్వీసులను మోహరించాయి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, మెడికల్ టీమ్‌లను అందుబాటులో ఉంచడం, తాత్కాలిక భద్రతా ఏర్పాట్లు చేపట్టడం వంటివి జరిగిపోతున్నాయి.
Read also: Google map: చెరువులోకి నడిపిన గూగుల్ మ్యాప్..ముగ్గురి పరిస్థితి సీరియస్