రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇటీవల రిలయన్స్ (Artificial Intelligence) మానిఫెస్టో ముసాయిదాను ఆవిష్కరించారు. ఈ ప్రణాళిక 6 లక్షలకు పైగా ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచే లక్ష్యంతో రూపొందించడం జరిగింది. అంబానీ ప్రకారం.. ఈ మానిఫెస్టో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై కూడా 10 రెట్లు ప్రభావాన్ని చూపించే విధంగా రూపొందించబడింది. ఈ ప్రణాళిక ద్వారా రిలయన్స్ సమ్మేళనం (Artificial Intelligence) -స్థానిక డీప్-టెక్ సంస్థగా మారి, ఉద్యోగుల పనితీరు, వ్యాపార ఫలితాలు, నూతన ఆవిష్కరణలను నేరుగా ప్రోత్సహించనుందని ఆయన తెలిపారు.అంబానీ కృత్రిమ మేధస్సును మానవ చరిత్రలో అత్యంత ప్రభావశీల సాంకేతిక అభివృద్ధి అని వివరిస్తూ..
Read Also: IRCTC: తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం
ప్రతి భారతీయుడికి సరసమైన AI అందించడం, భద్రత, నమ్మకం, జవాబుదారీతనాన్ని ఉంచుతూ, వ్యాపారాలలో AIని సులభంగా అనుసరించడం కీలకం అని చెప్పారు. మానిఫెస్టోలోని పార్ట్-I అంతర్గత పరివర్తనపై దృష్టి సారిస్తుంది. ఇందులో AIని కేవలం టెక్నాలజీ ప్రాజెక్ట్‌గా కాకుండా, ఉద్యోగుల పని విధానాన్ని పూర్తిగా మలిచే సాధనంగా ఉపయోగించబడుతుంది.రిలయన్స్ లో వర్క్‌ఫ్లోలను, ముఖ్యంగా ప్రొక్యూర్-టు-పే, ఆర్డర్-టు-క్యాష్, హైర్-టు-రిటైర్, ప్లాంట్-టు-పోర్ట్ వంటి ప్రక్రియలను మాన్యువల్ హ్యాండ్‌ఆఫ్‌లను తొలగిస్తూ,
వీటి ద్వారా 10 రెట్లు ప్రభావం
రియల్-టైమ్ విజిబిలిటీ, నిర్ణయాలు, నాణ్యతను పెంచే విధంగా పునర్వ్యవస్థీకరిస్తారు. AI, ఏజెంట్ ఆటోమేషన్ ద్వారా పునరావృతమయ్యే పనిని తగ్గించడానికి, చిన్న క్రాస్-ఫంక్షనల్ పాడ్‌లు ఏర్పాటుచేసి, డేటా, కార్యకలాపాలు, పాలన, అభ్యాసం ఆటోమేషన్ ఫ్లైవీల్స్ ద్వారా అమలును నడిపిస్తారు. మీడియా వంటి విభాగాలలో AIను ఉపయోగించి, వ్యాపారాలు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా దేశంపై 10 రెట్లు ప్రభావం చూపగలమని అంబానీ చెప్పారు.
AI ప్రజలను భర్తీ చేయడం కాదు.. కానీ పని ప్రమాణాలను పెంచడం, సంస్థ సామర్థ్యాన్ని విడుదల చేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తొంది. స్వదేశీ AI హార్డ్‌వేర్, రోబోటిక్స్, క్రాస్-డొమైన్ అప్లికేషన్ల ద్వారా సాంకేతిక స్వావలంబనను ప్రోత్సహిస్తూ, వ్యాపార వృద్ధి, సామాజిక ప్రభావం, భారతదేశ AI విప్లవానికి దోహదం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఇక జనవరి 10 నుంచి 26 వరకు ఉద్యోగులను AI ఆలోచనలు సమర్పించమని ఆహ్వానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: