యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల్లో పారదర్శకత పెంచేందుకు ఇకపై అభ్యర్థులందరికీ ‘ఫేస్ అథెంటికేషన్’ తప్పనిసరి చేశారు. Ai (Artificial Intelligence) టెక్నాలజీతో పనిచేసే ఈ విధానాన్ని ఇప్పటికే NDA, CDS పరీక్షల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా పరీక్షించారు. దీని వల్ల వెరిఫికేషన్ కేవలం 10 సెకన్లలోనే పూర్తవుతుందని, సమయమూ ఆదా అవుతుందని యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం వంటి మోసాలకు ఫేస్ అథెంటికేషన్‌తో చెక్ పడనుంది.
Read also: NEET UG 2026: నీట్ యూజీ సిలబస్ విడుదల

ఫేస్ అథెంటికేషన్ విధానం
దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సహా పలు నియామక పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.కాగా 2025 సెప్టెంబర్ 14న నిర్వహించిన NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ), NA (నావల్ అకాడమీ) II, CDS (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్) II పరీక్షల్లో ఈ ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని పైలట్ ప్రోగ్రామ్‌గా యూపీఎస్సీ విజయవంతంగా పరీక్షించింది. గురుగ్రామ్‌లోని కొన్ని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసి, అభ్యర్థుల గుర్తింపును డిజిటల్ పద్ధతిలో ధృవీకరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: