📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Arodeep Nandi: డిసెంబర్‌లో RBI రెపోరేటు తగ్గే అవకాశం?

Author Icon By Anusha
Updated: November 22, 2025 • 2:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చితి, వడ్డీరేట్ల మార్పులు… ఇవన్నీ పెట్టుబడిదారుల్లో సందేహాలు పెంచుతున్నాయి,భారతదేశపు మధ్యకాలిక ఆర్థిక దృశ్యం బలంగానే నిలబడుతుందనే నమ్మకాన్ని నోమురా సంస్థలో భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషించే ప్రముఖ ఆర్థికవేత్త ఆరోదీప్ నంది (Arodeep Nandi) వ్యక్తం చేశారు. రూపాయి క్రమంగా బలపడే అవకాశం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, అలాగే విధాన పరమైన సడలింపులు..

Read Also: Labour Codes: భారతదేశంలో నూతన కార్మిక కోడ్‌లు అమల్లోకి

ఇవన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతునిస్తాయని ఆయన వివరించారు. ముఖ్యంగా అమెరికాతో భారతదేశం కుదుర్చుకోబోయే వాణిజ్య ఒప్పందం రూపాయి మారక విలువపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నంది (Arodeep Nandi) విశ్వసిస్తున్నారు. రూపాయి విలువపై తమ అంచనాలను వెల్లడిస్తూ..

నోమురా (Arodeep Nandi) డిసెంబర్ 2025 చివరి నాటికి రూపాయి డాలర్‌కు 88 స్థాయిలో ముగుస్తుందని పేర్కొన్నారు.ఆపై 2026 మొదటి త్రైమాసికంలో 87.6 వరకు బలపడవచ్చని, 2026 చివరినాటికి 86.5 వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల అంతర్భాగంగా ఉన్న కీలక అంశం ఏంటంటే అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందం.

అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందం

అక్కడ నిర్ణయించే తుది సుంకాలు అత్యంత ప్రభావవంతమైన అంశాలవుతాయి. సుంకాలు 15 నుంచి 20 శాతం మధ్యలో ఉంటే భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుంది. కానీ సుంకాలు అధికంగా నిర్ణయిస్తే, భారత ఎగుమతిదారులు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని నంది (Arodeep Nandi) హెచ్చరించారు. అక్టోబర్ నెలలో భారత వాణిజ్య లోటు 41 బిలియన్ డాలర్లు దాటడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

ఇది అంచనాలను మించి ఉండగా.. US సుంకాల ప్రభావంతో బలహీనమైన ఎగుమతులు, అలాగే బంగారం సహా అనేక సరుకుల దిగుమతులు పెరగడం ఇతర కారణాలు అని నంది వివరించారు. ఈ నేపథ్యంలో నోమురా తాజా అంచనాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కరెంట్ అకౌంట్ లోటు GDPలో 1.2 శాతానికి స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది.

Arodeep Nandi: Is there a chance of RBI repo rate cut in December?

ఆర్థిక వ్యవస్థకు తక్కువ ద్రవ్యోల్బణం అనుకూలం

అయినప్పటికీ, ఆర్థిక సంవత్సరం చివరి నెలల్లో వాణిజ్య లోటు సాధారణంగా తగ్గే ధోరణి ఉన్నందున, బాహ్య ఆర్థిక ఒత్తిడులు గణనీయంగా పెరిగే అవకాశం లేదని నంది చెప్పారు.GDP వృద్ధి అంశంలో కూడా ఆశాజనక దృక్పథాన్నే చూపిస్తోంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి GDP వృద్ధి 7.6% ఉంటుందని అంచనా వేయగా, గత త్రైమాసికంలో నమోదైన 7.8 శాతంతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ అది సహజమని నంది వివరించారు.

తక్కువ ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా పనిచేస్తుందని, రాబోయే త్రైమాసికాల్లో వృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నోమురా అంచనాల ప్రకారం, FY26లో GDP వృద్ధి 7 శాతం, FY27లో 6.6 శాతంగా ఉండే అవకాశం ఉంది. భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చే అంశమని,

RBIకి సంక్లిష్టమైన నిర్ణయం

అంతర్జాతీయ గందరగోళం తగ్గితే అది కూడా భారత ఆర్థిక వాతావరణానికి బలంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో RBI వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందా? అనే ప్రశ్నపై ఆయన స్పందించారు. ఇది RBIకి చాలా సంక్లిష్టమైన నిర్ణయం అవుతుందని, అయితే నోమురా అంచనా ప్రకారం RBI మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించి రెపో రేటు (Repo rate) ను 5 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని తెలిపారు.

సమయంపై మాత్రం ఇంకా స్పష్టత లేకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోందని ఆయన చెప్పారు. బలమైన GDP పరిమాణాలు, తగ్గుతున్న ద్రవ్యోల్బణం తక్షణ కోత అవసరాన్ని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతదేశం చాలా క్లిష్టమైన దశలో ఉంది. ట్రంప్ సుంకాల ప్రభావం, GST కోతల ప్రభావం.. అన్నీ ఒకేసారి భారంగా మారుతున్నాయి. అయినప్పటికీ, నోమురా బేస్ కేస్ ఇప్పటికీ డిసెంబర్‌లో వడ్డీ రేటు కోతకే అనుకూలంగా ఉంది. కానీ ఆ నిర్ణయం RBIకి చాలా సవాలుతో కూడినదని నంది వ్యాఖ్యానించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

India economy India US Trade Deal latest news Nomura report rupee forecast Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.