📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Arjun Tendulkar: పెళ్లిపీటలు ఎక్కనున్న అర్జున్‌ టెండూల్కర్

Author Icon By Vanipushpa
Updated: August 14, 2025 • 4:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అర్జున్ బుధవారం (ఆగస్టు 13) ముంబైకు చెందిన బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌ (Saaniya Chandhok) తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అర్జున్, సానియా ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అర్జున్, సానియా చందోక్‌ ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఈ వేడుక గురించి టెండూల్కర్ కుటుంబం మాత్రం ఇప్పటివరకు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Arjun Tendulkar: పెళ్లిపీటలు ఎక్కనున్న అర్జున్‌ టెండూల్కర్

ఘాయ్ కుటుంబానికి చెందిన సానియా చందోక్‌..
సానియా ఘాయ్ కుటుంబానికి చెందిన యువతి. ఈమె ఎక్కువగా లో ప్రొఫైల్‌ మేంటేన్‌ చేసేందుకు ఇష్టపడుతుండడంతో చాలా మందికి ఆమె గురించి తెలిదు. ఈమె ముంబైలోని అత్యంత ప్రముఖ వ్యాపార కుటుంబం అయిన ఘాయ్‌ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఘాయ్ కుటుంబం ముంబైలో చాలా పేరున్న వ్యాపార కుటుంబం. వీరికి ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్ తో పాటూ బ్రూక్లిన్ క్రీమరీ ఐస్ క్రీమ్(తక్కువ కేలరీల ఐస్ క్రీం బ్రాండ్) వ్యాపారం కూడా ఉంది. గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్, 18 లిస్ట్-ఎ మరియు 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో, అర్జున్ 33.51 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు. అతను 23.13 సగటుతో 532 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో, అర్జున్ 25 వికెట్లు (సగటున 31.2) మరియు 102 పరుగులు (సగటున 17) సాధించాడు.

అర్జున్ టెండూల్కర్ ఏం చేస్తున్నాడు?

అర్జున్ టెండూల్కర్ 2021 సీజన్ నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో భాగమయ్యాడు మరియు 2023లో వారితో అరంగేట్రం చేశాడు.

అర్జున్ టెండూల్కర్ ఎన్ని ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు?

2023లో అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరపున ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి, కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dharmasthala-temple-key-evidence-in-the-excavations-of-dharmasthala/crime/525812/

Arjun Tendulkar Arjun Wedding Celebrity Weddings Cricket News Latest News Breaking News Sachin Tendulkar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.