📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

సోనూసూద్ ను అరెస్ట్ చేయబోతున్నారా..?

Author Icon By Sudheer
Updated: February 7, 2025 • 7:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ నటుడు, మానవతావాది సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. కోర్టు సమన్లకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసు నేపథ్యంలో సోనూసూద్‌ పేరు ప్రస్తావనలోకి రావడం గమనార్హం. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పేరుతో ఓ వ్యక్తిని రూ. 10 లక్షలు మోసం చేశాడని ఆరోపణలున్నాయి. బాధితుడు రాజేశ్ అనే లాయర్ ఈ కేసును న్యాయస్థానంలో దాఖలు చేశారు.

రాజేశ్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, ఈ వ్యవహారంలో సోనూసూద్ కీలక సాక్షిగా ఉన్నట్లు పేర్కొన్నారు. కోర్టు పంపిన నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో, జడ్జి దీనిపై తీవ్రంగా స్పందించి అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.

సోనూసూద్ పై ఇటువంటి ఆరోపణలు రావడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పాండమిక్ సమయంలో వేలాదిమందికి సహాయహస్తం అందించిన ఆయనకు పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉంది. అయితే, ఈ కేసులో ఆయన నిజంగా సంబంధం ఉందా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సోనూసూద్ దీనిపై ఎలా స్పందిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. కేసు విచారణలో కొత్త మలుపులు ఎలా ఉంటాయనేదే ఇప్పుడు అందరి ఆసక్తి.

Google news Sonusood sonusood arrest sonusood case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.