📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu News: Registration-త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా.. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి..

Author Icon By Pooja
Updated: September 19, 2025 • 1:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెళ్లి అనేది ఎవరికైనా ఓ మధురమైన జ్ఞాపకం. వెంటాడే ఈ పెళ్లి జ్ఞాపకాలను మరింతగా పదిలంగా కాపాడుకోవాలంటే అందుకు వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. పెళ్లి హడావుడిలో పడి, ప్రాముఖ్యమైన ఈ విషయాన్ని చాలా జంటలు విస్మరిస్తున్నాయి. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో దీనివల్ల చాలా లాభాలున్నాయి. వివాహ రిజిస్ట్రేషన్ ఎందుకు అవసరమో చాలామందికి తెలియడం లేదు. అందుకే దీనిపై అశ్రద్ధను చూపుతున్నారు. భార్యాభర్తల మధ్య చట్టబద్ధమైన సంబంధాన్ని ధృవీకరిస్తుంది.

దీని ప్రాముఖ్యత ఏమిటి?

దీనిద్వారా ఆ దంపతులకు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ అవకాశాలు, చిరునామా మార్పులు, ఆస్తి బదిలీ వంటి అనేక విషయాలలో ప్రయోజనాలు(Benefits) లభిస్తాయి. పలుచోట్ల పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతా, ఇన్సూ ఎన్స్ క్లెయిమ్స్ వంటి వాటికి వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. అంతేకాకుండా విదేశాలకూ వెళ్లాలనుకునే వారికి ముఖ్యంగా విదేశీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ సర్టిఫికెట్ తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని యువజంటలు పెళ్లి అయిన వెంటనే వివాహ రిజిస్ట్రేషన్ పై దృష్టి పెట్టాలి. వేడుకల హడావిడి ముగిసిన తర్వాత తగినంత సమయం కేటాయించి ఈ ప్రక్రియను పూర్తి చేయడం చాలా అవసరం. దీనివల్ల అనవసరమైన ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో సురక్షితంగా ఉండవచ్చు.

ఎంత సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

పెళ్లైన మూడు నెలల్లోపు పట్టణ పరిధిలో పురపాలక సంఘం, గ్రామాల్లో అయితే పంచాయితీ కార్యాలయాల్లో సంప్రదించి వివాహం జరిగినట్లు సర్టిఫికెట్స్ తీసుకున్నా, కొన్ని సందర్భాల్లో ఈ పత్రాలు ఉపయోగపడటం లేదు. కచ్చితంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి మళ్లీ వివాహ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఆయా కార్యాలయాల్లో హిందూ వివాహ రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. క్రైస్తవులు, ముస్లింలు ఆయా చర్చి, మసీదుల్లో నమోదు అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.

ధ్రువీకరణకు ఈ పత్రాలు అవసరం

పెళ్లి చేసుకున్న ఇరువురి శుభలేఖ ఉండాలి. వధూవరుల పాస్ పోర్టు సైజ్ ఫొటోలతోపాటు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాల జిరాక్స్, పెళ్లి జరిగిన తర్వాత దిగిన ఫొటోలు దరఖాస్తుతో (application) పాటు జతచేయాలి. విద్యావంతులైతే 10వ తరగతి మార్కుల లిస్టు ఇవాల్సి ఉంటుంది. ఇద్దరి తరపున ఇద్దరేసి సాఓఉలు సంతకాలు చేసి, వారి ఆధార్ కార్డుల జిరాక్స్, దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ఆయా ధ్రువీకరణ సమర్పించాలి. ఇటీవల కాలంలో విడాకుల సంఖ్య కూడా పెరిగిపోవడం, అక్రమసంబంధాలతో బంధాలను కాలరాసుకోవడం వంటి దురదృష్టకర సంఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వధువు కానీ, వరుడికి కానీ ఆస్తులు, ఇతర లావాదేవీలు, వివాహం జరిగినట్లుగా తగిన ఆధారల కోసం ఈ వివాహ రిజిస్ట్రేషన్లు ఎంతో ఉపయోగపడతాయి. విదేశాలకు వెళ్లినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ మరింతగా ఉపయోగపడుతుంది.

వివాహ రిజిస్ట్రేషన్ ఎందుకు అవసరం?
ఇది భార్యాభర్తల చట్టబద్ధమైన సంబంధాన్ని ధృవీకరిస్తుంది. అలాగే పాస్‌పోర్ట్, బ్యాంక్ ఖాతా, ఇన్సూరెన్స్, వీసా వంటి అవసరాల కోసం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.

ఎంత సమయంలో వివాహ రిజిస్ట్రేషన్ చేయాలి?
పెళ్లి జరిగిన మూడు నెలల్లోపు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telangana-police-jobs-massive-recruitment/telangana/550251/

documents for marriage registration Google News in Telugu Latest News in Telugu legal marriage proof Marriage registration marriage registration process Telugu News Today wedding certificate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.