📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్ ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్ ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

Aravalli Hills: సేవ్ ఆరావళి: సుప్రీంకోర్టు తీర్పుతో చెలరేగిన వివాదం

Author Icon By Pooja
Updated: December 22, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా ‘సేవ్ ఆరావళి’(Aravalli Hills) అనే నినాదాలతో ప్రజలు రోడ్లెక్కడానికి కారణం నవంబర్‌ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పే. ఆరావళి పర్వత శ్రేణికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు స్వీకరించి ఆమోదం తెలపడంతో ఈ అంశం వివాదంగా మారింది. ఆరావళికి ఇచ్చిన కొత్త నిర్వచనమే ప్రజల్లో తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

Read Also: Pension News: ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రద్దు వార్తలపై కేంద్రం వివరణ

Save Aravalli: The controversy that erupted following the Supreme Court’s verdict.

ఆరావళి పర్వతాలకు కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్వచనం ప్రకారం 100 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న పర్వతాలనే ఆరావళి(Aravalli Hills) పర్వతాలుగా పరిగణిస్తారు. అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న వాటిని సాధారణ కొండలు, గుట్టలుగా గుర్తిస్తారు. అంతేకాదు, 500 మీటర్ల పరిధిలో కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ పర్వతాలు ఉండాల్సిందే. ఒకే పర్వతం మాత్రమే ఉండి, దాని చుట్టూ 500 మీటర్ల దూరంలో మరో పర్వతం లేకపోతే అది ఆరావళి పరిధిలోకి రాదన్నది ఈ కొత్త నిబంధన.

మైనింగ్ మాఫియా భయం ఎందుకు?

ఈ కొత్త నిర్వచనంతో చిన్న చిన్న కొండలు ఆరావళి రక్షణ నుంచి బయటపడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు కొత్త మైనింగ్ లీజులపై ఆంక్షలు విధిస్తున్నా, రాష్ట్రాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విచ్చలవిడిగా తవ్వకాలకు అనుమతులు ఇవ్వొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో మైనింగ్ మాఫియా మరింత బలపడే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు.

చిన్న కొండలు ప్రాంతీయ వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి వర్షపాతం, భూగర్భ జలాలు, ఉష్ణోగ్రత నియంత్రణలో సహకరిస్తాయి. ముఖ్యంగా ఆరావళి మరోవైపు ఉన్న థార్ ఎడారి విస్తరించకుండా అడ్డుకోవడంలో ఈ కొండల పాత్ర అమూల్యమైనది.
వీటిని ధ్వంసం చేస్తే పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రామస్థుల ఉద్యమాలు, జైపూర్ ర్యాలీ

ఆరావళి పర్వతాలను కాపాడాలని కోరుతూ గ్రామస్థులు స్వయంగా కొండలెక్కి నిరసనలు చేపడుతున్నారు. ఇటీవల జైపూర్‌లో వేలాదిమంది పాల్గొన్న భారీ ర్యాలీ కూడా జరిగింది. కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనాన్ని వెంటనే మార్చాలని, లేదంటే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ విమర్శలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ఆరావళి పర్వతాల్లో దాదాపు 90 శాతం ప్రాంతాన్ని ఎలాంటి తవ్వకాలకూ అనుమతించబోమని స్పష్టం చేసింది. పర్వత శ్రేణి సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది.

ఆరావళి పర్వత శ్రేణి ప్రాముఖ్యత

ఢిల్లీ నుంచి హర్యానా, రాజస్థాన్‌, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వరకు దాదాపు 650 కిలోమీటర్ల మేర ఆరావళి పర్వత శ్రేణి విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణిగా గుర్తింపు పొందింది. సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పర్వతాల వల్లే ఉత్తర, మధ్య భారతంలో పర్యావరణ సమతుల్యత కొనసాగుతోంది. బనాస్‌, లూనీ, సబర్మతి వంటి నదులు ఇక్కడే జన్మించాయి. మౌంట్ అబూ వంటి ప్రసిద్ధ పర్వత ప్రాంతాలు కూడా ఆరావళిలో భాగమే.

జీవ వైవిధ్యం & ఢిల్లీకి గ్రీన్ లంగ్

ఆరావళి ప్రాంతంలో చిరుతలు, నక్కలు, ముంగీసలు, అనేక రకాల పక్షిజాతులు నివసిస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారతానికి ఇది ‘గ్రీన్ లంగ్’గా పనిచేస్తోంది. ప్రజలు నేడు స్వచ్ఛమైన గాలిని పీల్చగలుగుతున్నారంటే అందుకు ఆరావళి పెద్ద కారణం.

ఆరావళి కింద మార్బుల్‌, గ్రానైట్‌, జింక్‌, కాపర్‌ వంటి విలువైన ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. ఇదే మైనింగ్ మాఫియాను ఆకర్షిస్తోంది. ఈ కొత్త నిర్వచనంతో పర్వతాలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

EnvironmentalProtection Google News in Telugu Latest News in Telugu MiningThreat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.