AP MLAs: దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, వారి ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల్లో 14 మంది బిలియనీర్లు ఉండగా, వీరిలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి మూడు స్థానాలనూ ఏపీకి చెందిన ఎమ్మెల్యేలే కైవసం చేసుకోవడం గమనార్హం. వీరిలో టీడీపీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ.716 కోట్ల ఆస్తితో దేశంలోనే అత్యంత సంపన్న మహిళా ప్రజాప్రతినిధిగా మొదటి స్థానంలో నిలిచారు.
Read Also: Surat Suicide: ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడీఆర్ ‘విమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది. ఈ నివేదిక ప్రకారం రూ.716 కోట్ల ఆస్తితో ప్రశాంతి రెడ్డి మొదటి స్థానంలో ఉండగా, కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి రూ.388 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. ఇక, నెల్లిమర్ల నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి రూ.291 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ 14 మంది మహిళా బిలియనీర్ల మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విషయంలోనూ ఏడీఆర్ ఆసక్తికరమైన పోలికను చూపింది. ఏపీలో ఉన్న 24 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లుగా ఉండగా, తెలంగాణలోని 11 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి కేవలం రూ.14 కోట్లుగానే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మొత్తం మీద ఒకవైపు మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఉన్న కొద్దిమంది మహిళల్లో కొందరు అత్యంత సంపన్నులుగా ఉండటం ఈ నివేదిక ద్వారా స్పష్టమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: