మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ (AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన ‘x’ లో ట్వీట్ చేసారు.జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింసా విధానంతో కోట్ల మంది దేశప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలి. స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేద్దాం.
Read Also: AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై కక్ష కట్టారు.. చెవిరెడ్డి
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. “సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక.. తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు” అని వైఎస్ జగన్ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ఈ ట్వీట్ ద్వారా గాంధీజీ జీవితాన్ని, ఆయన బోధనలను జగన్ గుర్తుచేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: