📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: AP: లక్పతి దీదీలుగా 10 కోట్ల మంది: శివరాజ్ సింగ్ చౌహాన్

Author Icon By Rajitha
Updated: November 12, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళా స్వావలంబనకు మరిన్ని కార్యక్రమాలు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) గుంటూరు : రానున్న రోజుల్లో 10 కోట్లు మందిని లక్పతి దీదీలుగా మార్చటానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రతి ఏడాది లక్ష రూపాయల ఆదాయం కనీసం రావాలని, ప్రస్తుతం రెండు, మూడు కోట్లుగా ఉన్న లక్పతి దీదీల సంఖ్య పెంచటానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వాటర్ షెడ్ మహోత్సవం రెండు రోజుల జాతీయ సదస్సు రెండవ రోజు గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయ పాలెంలో మంగళవారం జరిగింది. ఈ జాతీయ సదస్సులో కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య వ్యక్తిగా వచ్చానని, రైతు సేవకుడిగా వచ్చానని, వారి సేవ దైవ సేవగా భావిస్తానని అన్నారు.

Read also: CBN Good News : ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు- చంద్రబాబు

AP: లక్పతి దీదీలుగా 10 కోట్ల మంది

పక్కా గృహం కలిగి ఉండాలని

నారా చంద్రబాబు నాయుడు గొప్ప ముందు చూపు గల వ్యక్తి అని, పవన్ కల్యాణ్ (pawan kalyan) దృష్టి, నరేంద్ర మోడీ ఆలోచనా విధానం వలన ఈ ముగ్గురి ఆలోచనా విధానం గొప్ప సమ్మేళనంగా ఉందన్నారు. వెంగళాయపాలెం వంటి చెరువుకు దేశంలో ఇతర ప్రాంతాల్లో చేపడతామని చెప్పారు. మహిళా స్వావలంబనకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన క్రింద ప్రతి ఒక్కరూ పక్కా గృహం కలిగి ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు సర్వే నిర్వహించి ఏ ఒక్కరు గుడిసెల్లో ఉండకుండా చూడాలని సూచించారు. వివిధ కార్యక్రమాల క్రింద ఉత్పాదన పెంచే విధానం ఉందని, అందరూ మూడు పంటలు వేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. చిన్న సన్నకారు రైతుకు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంచి చర్యలు చేపడుతోందని, ఇతర పంటలపై దృష్టి మార్చే విధంగా అవగాహన కల్పించడం మంచి విషయం అన్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ మామ అండగా ఉంటారని

అటువంటి పంటల ఉత్పాదకాలను ఎగుమతులు చేయుటకు సహకారం అందిస్తామని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మీ శివరాజ్ సింగ్ చౌహాన్ మామ అండగా ఉంటారని చెప్పారు. పెమ్మసాని చంద్ర శేఖర్ హిందీ, హిందీ ప్రాంత వాసులను ఆలోచింపజేసే విధంగా ఉందని ప్రశంసించారు. కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలన్నారు. 25 శాతం వర్షంపై ఆధారపడిఉన్నాయి, వీటికోసం ప్రధానమంత్రి వాటర్ షెడ్ కార్యక్ర మాలు చేపట్టాలని ఆలోచించారు. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రం ఒక భాగం కావాలని ఆలోచించారని చెప్పారు. ఈ పథకాలు బాగా అమలుచేసి ఆదర్శంగా నిలవాలని రాష్ట్రానికి తీసుకువస్తున్నామని తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశకు 40 శాతం యూరియా సరఫరా చేశారని తెలి పారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నీటిని ఒడిసి పట్టుకోకపోతే అనేక రకాలుగా నష్టపోతామన్నారు. ప్రధాన మంత్రి చక్కటి కార్యక్రమం అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భూ వనరుల విభాగం కార్యదర్శి మనోజ్ జోషి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగమైన వివిధ సంఘాలకు చెక్కులను అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

india latest news rural economy Telugu News Women Empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.