అస్సాం పోలీసులు పెద్ద ఎత్తున ఉగ్రకుట్రను అడ్డుకున్నారు. బంగ్లాదేశ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఒక తీవ్రవాద(AntiTerror Operation) సంస్థతో సంబంధాలు ఉన్న 11 మంది అనుమానిత ఉగ్రవాదులను అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఈ చర్యలు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన కీలక సమాచారంతో చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Read Also: India – Pak War : మరోసారి ఇండియా – పాక్ మధ్య యుద్ధం ?
స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బృందాలు అస్సాంలోని బార్పేటా, చిరాంగ్, దరాంగ్ జిల్లాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
భారీ దాడుల ప్రణాళికపై అనుమానాలు
ప్రాథమిక విచారణలో అరెస్ట్ అయినవారు(AntiTerror Operation) పెద్ద ఎత్తున దాడులు చేయాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ కుట్రకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించేందుకు భద్రతా సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: