బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ హాడీ(Sharif Osman Hadi) సింగపూర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గత వారం ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాడీకి ఢాకాలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించారు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు సింగ్‌పూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ హాడీ మరణాన్ని ధ్రువీకరించింది. హాడీ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హాడీ మరణంతో బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసనలు మిన్నంటాయి.
Read Also: Google Gemini AI: ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి
విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించిన ఉస్మాన్ హాడీ
గత ఏడాది జులై ఆగస్టులో జరిగిన బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమంలో హాడీ కీలక పాత్ర పోషించాడు. ఈ ఉద్యమం 15 ఏళ్ల షేక్ హసీనా పాలనకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ‘ఇంక్విలాబ్ మంచా’ అనే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించిన ఉస్మాన్ హాడీ.. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 32 ఏళ్ల విద్యార్థి నేత1994లో జన్మించారు. భారత్ పట్ల ద్వేషం ప్రదర్శించేవాడని.. ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ పేరుతో భారత భూభాగాలను కలిపి కొత్త మ్యాప్‌లు రూపొందించిన ప్రచారం చేశారని వార్తలు వచ్చాయి. డిసెంబర్ 12న ఢాకాలోని పాల్టన్ ప్రాంతంలో హాడీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆయన తలకు గాయం కాగా.. మొదట ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి, ఆ తర్వాత ఎవరెస్ట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనను సింగపూర్‌కు తరలించింది. హాడీ హంతకుల కోసం బంగ్లాదేశ్ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు ఇద్దరు అనుమానితుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు.. వారి గురించి ఆచూకీ ఇస్తే 5 మిలియన్ టాకాలు (సుమారు 42,000 డాలర్లు) రివార్డు ప్రకటించారు. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: