తమిళనాడు ధర్మపురి జిల్లా (Dharmapuri district, Tamil Nadu)లోని పెరియకరుప్పు ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది. ఇక్కడ పూజారికి కారం కలిపిన నీళ్లతో అభిషేకం (Anointing the priest with water mixed with spices) చేస్తారు. ఈ విశేష ఆచారం ప్రతి సంవత్సరం ఆడి అమావాస్య సందర్భంగా జరుగుతుంది.ఈసారి ఆడి అమావాస్య గురువారం రావడంతో భక్తులు ఆలయంలోకి భారీగా తరలివచ్చారు. 108 కిలోల కారం, 6 కిలోల పచ్చి మిరపకాయలు కలిపిన నీటితో పూజారి గోవింద్‌కు అభిషేకం చేశారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
భక్తుల ఉత్సాహం, మొక్కుల చెల్లింపులు
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటూ భక్తి భావంతో అభిషేకంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది.
ఆలయ ప్రాంగణంలో విందు
అభిషేకం అనంతరం భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో మాంసాహార విందు ఏర్పాటు చేశారు. వందలాది మంది భక్తులు ఆ విందులో భాగమయ్యారు.
తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం
స్థానికుల చెబుతున్న ప్రకారం, ఈ ఆచారం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఆలయ పూజారికి కారం నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా కష్టాలు తొలగుతాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు.ఈ ప్రత్యేక సంప్రదాయం ప్రతి సంవత్సరం భక్తులను ఆకర్షిస్తూ ప్రాంతీయ విశేషంగా నిలుస్తోంది.
Read Also : Midhun Reddy : మిథున్ రెడ్డికి హోమ్ ఫుడ్ అనుమతించలేం – జైళ్ల శాఖ