భారతదేశ వ్యాపార దిగ్గజం ధీరూబాయ్ అంబానీ గురించి పరిచయం అక్కర్లేదు. దేశ
వాణిజ్యరంగంలో తనదైన ప్రత్యేకముద్రను వేసుకున్న ధీరూబాయ్ మరణం తర్వాత ఆయన ఇద్దరు కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు తండ్రి వ్యాపారాన్ని కొనసాగించారు. అయితే వ్యాపారంలో వీరిద్దరికీ విభేదాలు రావడంతో, విడిపోయి ఎవరికి వారే వాణిజ్యాన్ని
కొనసాగిస్తున్నారు. ముఖేష్ అంబానీ బిజినెస్ లో మూడుపువ్వులు ఆరుకాయల్లా వర్ధిల్లుతున్నారు.
అయితే అనిల్అంబానీకి బిజినెస్లో గడ్డుకాలాన్ని (Tough times in business) కొనసాగిస్తున్నారు.

వ్యాపారంలో నష్టాలతో ముందుకు సాగలేనిస్థితికి చేరుకున్నారు. తాజాగా అనిల్ అంబానీ (Anil Ambani) కి చెందిన సంస్థలపై ఈడీ దాడులకు దిగింది. ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఈడీసోదాలను కొనసాగిస్తున్నది. ఇందుకు కారణం బ్యాంకుల నుంచి రుణం తీసుకుని దారి మళ్లించాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులకు రుణం చెల్లించేస్థితిలో లేనని గతంలోనే ప్రకటించారు. ఆయనపై ఇప్పటికే కోర్టులో కేసులున్నాయి. తాజా ఈడీ దాడులతో అనిల్ అంబానీ మరోసారి వార్తలో నిలిచారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Supreme Court: అడవులను కాపాడకుంటే మీరు జైలుకే: సుప్రీంకోర్టు
Modi: అందరి చూపు ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపైనే..