📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

అధిక పని గంటలపై స్పందించిన ఆనంద్ మహీంద్రా

Author Icon By sumalatha chinthakayala
Updated: January 11, 2025 • 8:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ : మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకు ఉద్యోగులు వారానికి 90 గంటలు, ఆదివారాల్లో కూడా పని చేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ఆలోచనలను పంచుకున్నారు. తన ఉద్దేశంలో పని ఎంతసేపు చేశామన్నది కాదు.. చేసిన పనిలో ఎంత నాణ్యత ఉందనేది ముఖ్యమని అన్నారు. ఢిల్లీలో జరిగిన విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో మాట్లాడిన మహీంద్రా… పనిలో క్వాంటిటీ లేకపోయినా క్వాలిటీ ఉండాలని చెప్పారు.

image

వారంలో 70 గంటలు, 90 గంటల పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఎల్ అండ్ టీ సుబ్రహ్మణ్యన్ చేసిన వాదనలపైనా ఆనంద్ మహీంద్రా స్పందించారు. తనకు నారాయణమూర్తి అన్నా, ఇతర కార్పొరేట్ దిగ్గజాలన్నా చాలా గౌరవం ఉందని, తన ఉద్దేశంలో ఎంతసేపు పనిచేశావన్నది ముఖ్యం కాదని, పనిలో నాణ్యత ముఖ్యమని చెప్పారు. వారంలో 48, 70 గంటలు, 90 గంటలు పనిచేయడం కంటే… క్వాలిటీ ఔట్ పుట్ పై దృష్టి సారించాలన్నారు. “నాణ్యమైన పని 10 గంటలు చేసినా చాలు… ప్రపంచాన్నే మార్చేయొచ్చు” అని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఇక రోజూ ఎన్ని గంటలు పని చేస్తే బాగుంటుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆనంద్ మహీంద్రా.. రోజులో ఇన్ని గంటలే పనిచేయాలన్న టైమ్ కు సంబంధించిన విషయం పక్కన పెడితే.. కచ్చితంగా ఇన్ని గంటలు పనిచేయాలని తాను చెప్పనని, కానీ చేసే పనిలో నాణ్యత ఉండాలని సూచించారు.

ఆర్థికంగా అభివృద్ధి చెందిన చాలా దేశాలు వారానికి 4 రోజుల పని విధానాన్ని స్వీకరించాయని ఆనంద్ మహీంద్రా గుర్తు చేశారు. కుటుంబం కోసం ఒక కారును తయారు చేయాలంటే.. కార్యాలయాల్లో దాని గురించి చర్చిస్తే సరిపోదనీ.. తమ కుటుంబంలో ఎలాంటి కారును కోరుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యమని మహీంద్రా అన్నారు. కిటికీలు తెరిచి గాలిని లోపలికి రానివ్వండి అన్న గాంధీజీ మాటలను ఆయన గుర్తుచేశారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలంటూ ఎల్‌అండ్‌టీ చైర్మన్ సుబ్రహణ్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. ఉద్యోగులు ఆదివారాలు కూడా పని చేయాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ‘‘మీతో ఆదివారాలు కూడా పని చేయించలేకపోతున్నందుకు నాకు విచారంగా ఉంది. ఎందుకంటే నేను ఆదివారాలు కూడా పని చేస్తాను’’ అని ఆయన కామెంట్ చేశారు. అంతకుముందు భారత దేశ యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన సైతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

90 Hours In A Week anand mahindra Infosys Narayana L&T Subrahmanyan Work Balance working hours

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.