Telugu News: Amnit Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు..భార్య పై కేసు నమోదు

Read Time:  1 min
Amnit Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు..భార్య పై కేసు నమోదు
Amnit Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు..భార్య పై కేసు నమోదు
FONT SIZE
GET APP

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా(Haryana) ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్(Pooran Kumar) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమార్ పై పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేశారు. పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న రెండు రోజుల తర్వాత, ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ రోహ్‌తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

 Read Also: Central: కరెంటు సరఫరా ప్రై’వేటు’!

Amnit Kumar

ఏఎస్ఐ సందీప్ భార్య ఫిర్యాదు, ఆరోపణలు

తన భర్త మరణానికి ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమారే కారణమంటూ ఏఎస్ఐ సందీప్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూరన్ అవినీతిపై తన భర్త విచారణ జరుపుతున్నాడని, అందుకే ఆయనపై పూరన్, అమ్నీత్ సహా ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడ్డారని సందీప్ భార్య ఆరోపించారు. అమ్నీత్ ను అరెస్టు చేసేంత వరకు తన భర్తకు అంత్యక్రియలు జరపబోమని చెబుతూ, బంధువులతో కలిసి సందీప్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అమ్నీత్ కుమార్ పై కేసు నమోదు చేశారు.

పూరన్ కుమార్ సూసైడ్ వివాదం

కుల వివక్షతో ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని, తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ హర్యానా జైళ్ల శాఖ ఐజీ, ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఇటీవల తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య అమ్నీత్ కుమార్, తన భర్త మరణానికి కారణమైన హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ బిజార్నియాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన సంచలనం కావడంతో హర్యానా ప్రభుత్వం డీజీపీని సెలవుపై పంపడంతో పాటు రోహ్‌తక్ ఎస్పీని సస్పెండ్ చేసింది.

సందీప్ కుమార్ ఆత్మహత్య లేఖ

పూరన్ కుమార్ మరణించిన రెండు రోజుల తర్వాత రోహ్‌తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూరన్ కుమార్ అత్యంత అవినీతిపరుడని, తన అవినీతిపై విచారణ జరుగుతుండడంతో నిజాలు బయటపడతాయనే భయంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని సందీప్ కుమార్ తన సూసైడ్(Suicide) లేఖలో ఆరోపించారు. డీజీపీ శత్రుజీత్ కపూర్ నిజాయితీపరుడని, పూరన్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేశాడని విమర్శించ

ఐపీఎస్ పూరన్ కుమార్ భార్యపై కేసు ఎందుకు నమోదైంది?

రోహ్‌తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్యకు ఆమె కారణమని సందీప్ భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఏఎస్ఐ సందీప్ కుమార్ ప్రధానంగా ఏ ఆరోపణలు చేశారు?

ఐపీఎస్ పూరన్ కుమార్ అవినీతిపరుడని, తన అవినీతిపై విచారణ జరుగుతున్నందున భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.