Latest News: AmitShah : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ దూకుడు

Read Time:  1 min
Amit Shah
Amit Shah
FONT SIZE
GET APP

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. తాజా వివరాల ప్రకారం, 174 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరోవైపు, 66 స్థానాల్లో మహాఘటబంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ ప్రభావం కనిపించలేదు.

Read Also: Jubilee Hills Results: జూబిలీ హిల్స్ లో రెండవ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

 AmitShah
AmitShah

అమిత్ షా అంచనాలకు అనుగుణంగా ఫలితాలు

ప్రచార సమయంలో హోంమంత్రి అమిత్ షా(AmitShah) చేసిన వ్యాఖ్యలు నిజం అవుతున్నాయి. ఎన్డీఏ 160కి పైగా సీట్లు గెలుస్తుందని, రెండు-మూడొంతుల మెజారిటితో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ప్రకటించారు. ఉదయం ప్రారంభమైన లెక్కింపులోనే ఎన్డీఏ(National Democratic Alliance) భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించడం, ఈ అంచనాలను బలపరుస్తోంది. విశ్లేషకుల ప్రకారం, ఇది అమిత్ షా(AmitShah) వ్యూహాలకు దక్కిన విజయంగా భావిస్తున్నారు.

మహాఘటబంధన్‌కు భారీ ఎదురుదెబ్బ

లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని మహాఘటబంధన్‌కు ఈ ఎన్నికలు చేదు ఫలితాలను అందిస్తున్నాయి. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ తన స్థాయికి తగినన్ని సీట్లు సాధిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బలహీనత కారణంగా కూటమి మొత్తం దెబ్బతిన్నది. 2020లో 75 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన RJD, ఈసారి ఆ స్థానం కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.

పార్టీల వారీగా తాజా ఆధిక్యాలు

  • జేడీయూ – 79
  • బీజేపీ – 74
  • ఏఎప్జేపీ (RV) – 17
  • ఆర్జేడీ – 47
  • కాంగ్రెస్ – 11

బీహార్ రాజకీయ దిశ పూర్తిగా మారుతోందని తాజా లెక్కింపు స్పష్టం చేస్తోంది

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.