AmitShah: తూర్పు నాగాలాండ్‌కు కీలక ఒప్పందం

Read Time:  1 min
AmitShah
AmitShah
FONT SIZE
GET APP

తూర్పు నాగాలాండ్‌లో కొనసాగుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ల మధ్య అమిత్ షా(AmitShah) సమక్షంలో కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా స్వయం ప్రతిపత్తితో కూడిన ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ (FNTA)ను ఏర్పాటు చేయనున్నారు.

Read Also:Pariksha Pe Charcha: విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ

AmitShah

మినీ సెక్రటేరియట్ ద్వారా ఆరు జిల్లాల అభివృద్ధి

ఈ ఒప్పందం ప్రకారం, తూర్పు నాగాలాండ్‌లోని(AmitShah) ఆరు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. ఈ ఒప్పందం ద్వారా తూర్పు నాగాలాండ్‌లోని 8 ప్రధాన నాగా తెగల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఉపాధి వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.