Telugu News: Amith Shah: ఢిల్లీ పేలుడు దర్యాప్తుపై అమిత్ షా కీలక భేటీ

Read Time:  1 min
Vande Mataram 150 years
Vande Mataram 150 years
FONT SIZE
GET APP

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. తన కార్యాలయంలో NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), IB (ఇంటెలిజెన్స్ బ్యూరో) చీఫ్‌లతో సమావేశమై దర్యాప్తు పురోగతిపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేలుడు వెనుక ఉన్న కుట్రలపై స్పష్టతకు దర్యాప్తు బృందాలకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

Read Also: Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం

Amith Shah
Amith Shah

సాయంత్రం మరోసారి రివ్యూ మీటింగ్
మధ్యాహ్న భేటీ(Amith Shah) అనంతరం, సాయంత్రం మరోసారి కీలక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్ర భద్రతా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.

ఫరీదాబాద్-ఢిల్లీ లింక్‌పై దర్యాప్తు వేగం
పేలుడు ఘటనకు సంబంధించి ఫరీదాబాద్-ఢిల్లీ లింక్ కోణంలో NIA అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. దర్యాప్తు విస్తృతంగా కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.