📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Amit Shah : పాక్ పై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు…

Author Icon By Divya Vani M
Updated: May 17, 2025 • 9:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాంధీనగర్‌లో శనివారం జరిగిన సభలో కేంద్ర హోం మంత్రి Amit Shah సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత భద్రతా బలగాలు ఆపరేషన్ సిందూర్‌తో దేశ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాయని చెప్పారు.”భారత్‌పై టెర్రరిస్ట్ దాడులు జరిగితే.వాటికి రెట్టింపు బలంతో సమాధానం ఉంటుందన్న సంకేతాన్ని మన బలగాలు ఇచ్చాయి” అని స్పష్టం చేశారు.పాక్‌ను లక్ష్యంగా చేసిన ఆపరేషన్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని అన్నారు.ఈ ఆపరేషన్‌లో భారత సాయుధ దళాలు పాక్ భూభాగంలో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి కీలక దాడులు జరిపాయి.ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి.అమిత్‌షా వివరించిన ప్రకారం, జైషే మహమ్మద్‌, లష్కరే తొయిబా వంటి ఆర్గనైజేషన్‌ల ప్రధాన కేంద్రాలపై ఘాటైన దాడులు జరిగాయి.మొత్తం 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి.

Amit Shah పాక్ పై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు…

ఉగ్రవాదంపై మోదీ ప్రణాళిక: ప్రపంచం ఆశ్చర్యపోయింది

“ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశ శక్తిని ప్రపంచం గుర్తించింది.ఉగ్రదాడులపై మోదీ చూపిన తక్షణ ప్రతిస్పందన ఇతర దేశాల నాయకులని ఆశ్చర్యపరిచింది,” అని అమిత్‌ షా అన్నారు.పాక్ బెదిరింపుల గురించి మాట్లాడుతూ, “పాక్ అణుబాంబుల పేరుతో బెదిరించింది.కానీ భారత్‌ ఏ మాత్రం భయపడలేదు.మన ఆర్మీ, నేవీ,ఎయిర్‌ఫోర్స్ కలిసికట్టుగా సమర్థంగా ఎదురొడ్డాయి” అన్నారు.

భారత బలగాల ధైర్యానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు

“మన బలగాల తీరును చూసి ప్రపంచ దేశాలు మెచ్చుకున్నాయి.ఇది భారత రక్షణ వైఖరికి నిదర్శనం,” అని హోం మంత్రి అన్నారు.భారత చరిత్రలో ఇది ఓ మైలురాయి అని ఆయన స్పష్టం చేశారు.”స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత బలగాలు పాక్‌లో 100 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకెళ్లి ఇలా దాడి చేసినది ఇదే మొదటిసారి”అని చెప్పారు.

భారత ప్రజలకు కేంద్రం ఇచ్చిన హామీ

“మన ప్రజల భద్రతకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉంది. ఎవరైనా దాడికి వస్తే… వాళ్లకు తగిన గుణపాఠం నేర్పే బలం మనదేశానికి ఉంది” అని అన్నారు.

Read Also : PM Modi : ప్రధాని మోదీని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ – ఢిల్లీలో ఆసక్తికర సమావేశం

AmitShahSpeech IndianArmyStrike IndiaVsTerrorism OperationSindoor PakistanTerrorCamps

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.