ఉత్తర జార్ఖండ్‌లోని బొకారో ప్రాంతంలో నక్సలిజం (Naxalism)పూర్తిగా నశించినట్లు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో యావత్ దేశం నక్సల్స్ సమస్య నుంచి విముక్తి పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్ వివరాలను ఆయన వెల్లడించారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో మేజర్ సక్సెస్‌ను సాధించామన్నారు.
సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా బెటాలియన్ , రాష్ట్ర పోలీసులు ఈ సక్సెస్‌లో భాగస్వామ్యులైనట్లు తెలిపారు. తలపై కోటి రూపాయల నజరానా ఉన్న నక్సల్ కమాండర్ సీసీఎం సహదేవ్ సోరెన్ అలియాస్ పర్వేశ్‌ను హతమార్చినట్లు ఆయన చెప్పారు. దీనికి తోడు మరో ఇద్దరు నక్సల్స్‌ను కూడా హతమార్చామన్నారు. రఘునాథ్ హెంబ్రమ్ అలియాస్ ఛంచాల్, బిర్సేన్ గంజూ అలియాస్ రామ్‌కేల్వాన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్ ద్వారా బొకారో ప్రాంతంలో ఉన్న నక్సలిజం అంతమైనట్లు షా(Amit Shah) వెల్లడించారు. యావత్ దేశం కూడా త్వరలో విముక్తి చెందుతుందన్నారు.
అమిత్ షా చార్టర్డ్ అకౌంటెంట్?
అమిత్ 19 సంవత్సరాలకు పైగా పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం కలిగిన అనుభవజ్ఞుడైన చార్టర్డ్ అకౌంటెంట్, అందులో 10 సంవత్సరాలు ఆటోమొబైల్ బహుళజాతి సంస్థలో పనిచేశాడు. వివిధ పరిశ్రమలలో ఫైనాన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఆడిట్ మరియు ప్రభుత్వ సంబంధాల రంగాలలో అతనికి వృత్తిపరమైన అనుభవం ఉంది.
అమిత్ షా హిందువా లేక జైనుడా?
ఆయన బనియా కులానికి చెందిన గుజరాతీ హిందూ కుటుంబానికి చెందినవారు. ఆయన ముత్తాతగారు మాన్సా అనే చిన్న రాష్ట్రానికి నాగర్సేత్ (రాజధాని నగర అధిపతి). ఆయన తండ్రి అనిల్ చంద్ర షా, మాన్సాకు చెందిన వ్యాపారవేత్త, విజయవంతమైన పివిసి పైపుల వ్యాపారాన్ని కలిగి ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: