📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Amit Shah – జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు .. అమిత్‌ షా

Author Icon By Sudha
Updated: August 25, 2025 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ధన్‌ఖడ్‌ రాజీనామాపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజీనామా తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఆయన్ని సంప్రదించలేకపోతున్నారు. దీంతో ‘జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎక్కడ..?’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ధన్‌ఖడ్‌ గృహనిర్బంధంలో లో ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధన్‌ఖడ్‌ రాజీనామాపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) తాజాగా స్పందించారు. ఈ మేరకు ‘హౌస్‌ అరెస్ట్‌’ వార్తలను తీవ్రంగా ఖండించారు. ప్రముఖ జాతీయ మీడియా ఏఎన్‌ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్‌ షా మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యల కారణంగా ధన్‌ఖడ్‌ రాజీనామా చేసినట్లు చెప్పారు. ‘రాజీనామాకు గల కారణాలను ధన్‌ఖడ్‌ సాబ్‌ లేఖలో స్పష్టంగా చెప్పారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి.. పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అనుసరిస్తూ చక్కగా పని చేశారు. ఆయన రాజీనామా గురించి ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదు’ అని అమిత్‌ షా (Amit Shah)స్పష్టం చేశారు.

Amit Shah – జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు .. అమిత్‌ షా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జూలై 21న రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని అందచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ధన్‌ఖడ్‌ రాజీనామాతో తదుపరి వీపీగా మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ ప్రభుత్వం బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఇక విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ సుదర్శన్‌ రెడ్డి ఎంపిక చేశారు. వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సంఖ్యా బలం దృష్ట్యా చూస్తే ఆయన ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.


హోం మంత్రి ఎంత శక్తివంతుడు?

కేంద్ర మంత్రివర్గంలో అత్యంత సీనియర్ మంత్రిత్వ శాఖలలో ఒకటి, హోం మంత్రి యొక్క ప్రధాన బాధ్యత భారతదేశ అంతర్గత భద్రతను నిర్వహించడం; దేశంలోని పెద్ద పోలీసు దళం దాని అధికార పరిధిలోకి వస్తుంది.

అమిత్ షా హిందువా లేక జైనుడా?

అమిత్‌భాయ్ అనిల్‌చంద్ర షా 1964 అక్టోబర్ 22న ముంబైలో జన్మించారు. ఆయన బనియా కులానికి చెందిన గుజరాతీ హిందూ కుటుంబానికి చెందినవారు. ఆయన ముత్తాత మాన్సా అనే చిన్న రాష్ట్రానికి నాగర్‌సేథ్ (రాజధాని నగర అధిపతి).

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/amit-shah-support-for-the-constitution-amendment-bill/national/535674/#google_vignette

Amit Shah Breaking News Dhankhar resignation Indian Politics Jagdeep Dhankhar latest news Rajya Sabha Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.