Parliament speech India : కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో “ఓటు దోపిడి” ఆరోపణలకు ఇచ్చిన తీవ్ర ప్రతిస్పందనకు మరో కోణం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. గురువారం జరిగిన లోక్‌సభ సమావేశంలో ఆయన 102 డిగ్రీల జ్వరంతో మాట్లాడినట్లు తెలిసింది. సమావేశం ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందే వైద్యులు ఆయనను పరీక్షించి జ్వరాన్ని తగ్గించే మందులు ఇచ్చారని సమాచారం.
అయినా షా సభలో ఒకరిన్నర గంటకు పైగా నిలబడి ప్రతిపక్షం చేసిన ఆరోపణలకు ఒక్కోటి సమాధానం ఇచ్చారు. ఓటర్ లిస్ట్, స్పెషల్ రివిజన్ ఇన్‌స్పెక్షన్ (SIR), ఎన్నికల సంఘ నియామకాలపై వచ్చిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఆయన ప్రసంగం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రాశంసిస్తూ, “అమిత్ షా ప్రసంగం స్పష్టమైన నిజాలను చూపించిందని, ఎన్నికల సంస్కరణలపై చేస్తున్న అబద్ధాలను బయటపెట్టిందని” అన్నారు.
Read also: Indigo Auto-Rickshaw: ఇండిగో ఎయిర్‌లైన్స్ Vs ఇండిగో ఆటో: హర్ష్ గోయెంకా ఫన్నీ పోస్ట్
రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో “ఓటు దోపిడి”ని “హైడ్రోజన్ బాంబ్”గా అభివర్ణిస్తూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బిహార్ ఎన్నికల (Parliament speech India) ముందు ఈ అంశంపై ర్యాలీలకూ వెళ్లారు. శీతాకాల సమావేశంలో కూడా ఇదే విషయాన్ని మరోసారి లేవనెత్తారు.
ఈ నేపథ్యంలో షా ప్రతిభావంతంగా కౌంటర్ ఇస్తూ, “ఎవరు నాకు ఏ క్రమంలో మాట్లాడాలని చెప్పలేరు” అంటూ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ఓటర్ లిస్ట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే, అదే సమయంలో SIR ప్రక్రియను కూడా వ్యతిరేకించడం “డబుల్ స్టాండర్డ్స్” అని అన్నారు.
వాస్తవానికి SIR పై చర్చ జరగకూడదని తాను భావిస్తున్నప్పటికీ, ప్రతిపక్షం పారిపోయిందని చెప్పకుండా ఉండేందుకే చర్చకు అంగీకరించామని షా తెలిపారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘానికి పంపలేదని ఎన్నికల సంఘం అధికారులే తమకు చెప్పినట్లు షా వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: