📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి!

Telugu News: Amit Shah: బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసిన పార్టీ

Author Icon By Sushmitha
Updated: December 13, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీజేపీ (BJP)కి కొత్త అధ్యక్షుడు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడు ఎంపిక జరగనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరియు హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కొత్త అధ్యక్షుడి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మరియు 2029 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కీలక నియామకాల పైన వారు దృష్టి సారించారు.

Read Also: Kerala: లైంగిక దాడి కేసులో ప్రముఖ నటిపై కోర్టు కీలక తీర్పు

Amit Shah BJP has finalized its new president.

బీజేపీ జాతీయ అధ్యక్ష రేసు: ధర్మేంద్ర ప్రధాన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఇటీవల బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయం కోసం ఆయన కీలక పాత్ర పోషించారు. అంతకుముందు కూడా పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం ఆయన అమలు చేసిన వ్యూహాలు ఫలించాయి.

ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్ పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. అయితే, ప్రధాన్‌కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరిగే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2027 రాష్ట్రపతి ఎన్నికను పరిగణనలోకి తీసుకొని ప్రాంతాలు, సమీకరణాల ఆధారంగా మోదీ-షా ద్వయం నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా, చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే తప్ప, ధర్మేంద్ర ప్రధాన్ కొత్త బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక: యూపీ, కర్ణాటక

డిసెంబర్ 19న పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకోనుంది. 29 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌ (యూపీ), కర్ణాటక పార్టీ అధ్యక్షుల ఎంపిక మాత్రమే పెండింగ్‌లో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Dharmendra Pradhan Google News in Telugu Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.