బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Bihar Assembly Election Results) వెలువడిన తర్వాత రాజకీయంగా దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న ఈ ఎన్నికల్లో జేడీయూ ఆధ్వర్యంలో NDA సాధించిన విజయానికి పలువురు నేతలు తమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ (CM Stalin) స్పందిస్తూ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ విజయాన్ని అభినందించారు.
Read Also: Jammu & Kashmir blast:అది ప్రమాదమే.. ఉగ్రకుట్ర కాదు: జమ్మూ కాశ్మీర్ డీజీపీ క్లారిటీ
ఇండీయా కూటమి నేతలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి
మరోవైపు RJD నేత తేజస్వీ యాదవ్ క్యాంపైన్ చేసిన తీరును మెచ్చుకున్నారు. ‘ఈ ఫలితాల నుంచి ఇండీయా కూటమి నేతలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అలాగే ఈ ఫలితాలతో ఎన్నికల సంఘం (EC) పై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేం. పౌరులు మరింత పారదర్శక ఎన్నికల సంఘానికి అర్హులు’ అని (CM Stalin) తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: