📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Allahabad HC: విడాకుల కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

Author Icon By Aanusha
Updated: January 23, 2026 • 8:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) కీలక తీర్పు వెలువరించింది, తన కుటుంబ సభ్యులు చేసిన దాడి కారణంగా భర్త సంపాదన శక్తిని కోల్పోయిన పరిస్థితుల్లో, ఆ భార్యకు భరణం పొందే హక్కు ఉండదని. భార్య తరపు బంధువులు జరిపిన కాల్పుల్లో వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో, హోమియోపతి డాక్టర్‌గా పనిచేస్తున్న భర్త శాశ్వత వికలాంగుడిగా మారిన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. భర్త శారీరక, ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, భార్య దాఖలు చేసిన భరణం పిటిషన్‌ను తిరస్కరించింది.

Read Also: Tamil Nadu : తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్ – ప్రధాని మోదీ

భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది

భార్య కుటుంబ సభ్యులు చేసిన నేరపూరిత దాడి వల్ల.. భర్త తన జీవనోపాధిని కోల్పోతే, ఆ భర్త నుంచి భార్య భరణం కోరలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ లక్ష్మీ కాంత్ శుక్లా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ తీర్పునిస్తూ భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్‌కు చెందిన డాక్టర్ వేద ప్రకాష్ సింగ్ (హోమియోపతి డాక్టర్) మీద 2019లో అతని భార్య తండ్రి, సోదరుడు కలిసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డాక్టర్ వెన్నెముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. డాక్టర్ల సలహా ప్రకారం ఆ బుల్లెట్ పెల్లెట్‌ను శరీరంలో నుంచి తొలగిస్తే ఆయనకు పక్షవాతం వచ్చే అవకాశం ఉండటంతో దాన్ని అలాగే ఉంచారు.

Allahabad High Court’s key verdict in divorce case

దీనివల్ల వేద ప్రకాష్ సింగ్ కనీసం కూర్చోలేక, తన డాక్టర్ వృత్తిని కొనసాగించలేక నిరుద్యోగిగా మారిపోయారు.భార్య తరపు వారు చేసిన దాడి వల్ల భర్త సంపాదన శక్తిని కోల్పోయినప్పుడు.. అదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని భార్య భరణం అడగడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. తమ సొంత తప్పిదాల వల్ల కలిగిన నష్టాన్ని అనుకూలంగా మార్చుకుని భరణం కోరడం అన్యాయమని ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ శుక్లా అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Allahabad High Court latest news maintenance case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.