ఈ మధ్య బ్యాంకింగ్ రంగాన్ని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) తప్పుడు ఫోన్ కాల్స్, ఫిషింగ్ మెసేజ్‌లు ద్వారా ఖాతాదారులను మోసగించడానికి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తన ఖాతాదారులకు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. బ్యాంకింగ్ సేవల కోసం తమకు వచ్చే ఫోన్ కాల్స్ అసలైనవా, కాదా అన్నదానిపై స్పష్టత ఇవ్వడం ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేసింది.
జాగ్రత్తగా ఉండాలని SBI సూచన
ఎస్‌బీఐ ప్రకారం, వారు కస్టమర్లకు ఫోన్ చేసే నంబర్లు +91-1600తో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఇదే బ్యాంక్‌కు సంబంధించిన చట్టబద్ధమైన నంబర్ అని వెల్లడించారు. ఈ నంబర్ల నుంచే ఎస్‌బీఐ ఉద్యోగులు కస్టమర్లకు కాల్ చేస్తారని తెలియజేశారు. ఈ నంబరుల మినహాయించి వచ్చే ఇతర నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌ను అనుమానాస్పదంగా భావించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఖాతాదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత
నకిలీ కాల్స్ ద్వారా పాస్‌వర్డ్లు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం అడిగే అవకాశముందని, అటువంటి సందర్భాల్లో ఖాతాదారులు ఏవిధంగా స్పందించాలో ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. తమ అధికారిక నంబర్లను గుర్తుంచుకోవాలని, అవసరమైతే వాటిని సేవ్ చేసుకోవాలని కూడా సూచించింది. ఖాతాదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని బ్యాంక్ స్పష్టం చేసింది.
Read Also : Bengaluru Stampede : కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు