Alcohol free wedding : పెళ్లి వేడుకల్లో మద్యం వినియోగం కారణంగా జరిగే గొడవలు, అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు Uttarakhand లోని ఓ గ్రామ సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మద్యం పంపిణీ చేయకుండా వివాహం నిర్వహించే కుటుంబాలకు రూ.51 వేల ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నిర్ణయం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
వివరాల్లోకి వెళ్తే, డోయీవాలా నియోజకవర్గ పరిధిలోని గడుల్ గ్రామ సర్పంచ్ స్వీటి రావత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివాహ వేడుకల్లో మద్యపానం వల్ల డబ్బు వృథా కావడమే కాకుండా, యువత మద్యానికి అలవాటు పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో మద్యం లేకుండా పెళ్లి జరిపే కుటుంబాలకు రూ.51 వేల నగదు సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం
ఇప్పటివరకు రెండు కుటుంబాలు ఈ నిబంధనను పాటించగా, వారికి ఆర్థిక సాయం అందజేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ నిర్ణయానికి గ్రామ ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని, జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులు ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారని చెప్పారు.
ఇదిలా ఉండగా, గతంలో కూడా ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో ఇలాంటి ప్రయత్నం జరిగింది. దేవ్‌ప్రయాగ్ గ్రామంలో మద్యం లేకుండా పెళ్లి జరిపితే వధువుకు రూ.10 వేల నగదు బహుమతి ఇస్తామని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసులే విరాళాల రూపంలో సమకూర్చడం విశేషం. ఈ తరహా చర్యలు సమాజంలో మార్పుకు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: