బీహార్ లో(Bihar) ఎస్ ఐఆర్ పేరుతో ఆడిన గేమ్ పశ్చిమబెంగాల్, తమిళనాడు, యూపీ, ఇతర రాష్ట్రాల్లో ఇకపై సాగదని యూపీ మాజీసీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ ఎన్నికల కుట్ర బయటపడిందని అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆరోపించారు. ‘వాళ్ల ఆటలు సాగనివ్వం.. అలర్ట్ గా ఉంటాం. బీజేపీ చర్యలను అడ్డుకుంటామన్నారు.
బీజేపీ అంటే అదొక పార్టీ కాదని, అదొక మోసం అని ట్వీట్ చేశారు. ఎన్నికల సంఘంలో ఎన్డీయే కుమ్మక్కై భారీ మెజార్టీతో గెలుపొందుతుందని, ఈ విషయం అందరికీ తెలిసిందే అని తరచూ రాహుల్ గాంధీ అంటుంటారు. కాగా బీహార్ లో ఆర్జేడీకీ ఊహించని ఓటమి పొందింది. గతంలో పొందిన స్థానాలు సైతం పొందలేక భారీ ఓటమి భారంతో ఉంది.
Read Also: Health: డీప్ ఫ్రై చేసిన ఆహారం ఆరోగ్యానికి హానికరమా?
గెలుపుపై స్పందించిన నడ్డా
ఈ ఎన్నికలు ఎన్డీఏ చారిత్రాత్మక విజయం అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోదీ, నితీష్ ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ విధానాలపై నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. జంగల్ రాజ్, అవినీతిని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. సుపరిపాలన, స్థిరత్వం, అభివృద్ధికి ఓటేశారని జేపీ నడ్డా ట్వీట్ చేశారు. కాగా భారీ మెజర్టీతో(Majority) గెలుపుదిశగా వెళ్తున్న ఎన్డీయే కూటమి ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. భారీగా స్వీట్లను పంచుకుంటూ, తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. పలుచోట డ్యాన్స్ చేస్తూ, రోడ్లపై డబ్బులతో గంతులు చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: