📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Akhilesh Yadav : ఢిల్లీలో ఆందోళన ..బారికేడ్లు ఎక్కి దూకిన ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌

Author Icon By Sudha
Updated: August 11, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌లో ఓటర్ల (voters)ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష పార్టీల ఎంపీలు పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన నాయకుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో వివిధ విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. సమాజ్‌వాది పార్టీ చీఫ్‌, ఎంపీ అఖిలేష్ యాదవ్‌ (Akhilesh Yadav) బారికేడ్లు ఎక్కి దూకారు.

Akhilesh Yadav : ఢిల్లీలో ఆందోళన ..బారికేడ్లు ఎక్కి దూకిన ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌

ఇండియా కూటమి ఎంపీల ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు సంసద్‌ మార్గ్‌లో భారీగా మోహరించారు. ఈసీ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్తున్న ఎంపీలను బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. అయితే, ప్రతిపక్ష ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాజ్‌వాది పార్టీ చీఫ్‌, ఎంపీ అఖిలేష్ యాదవ్‌ (Akhilesh Yadav) బారికేడ్లు ఎక్కి దూకారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. మరోవైపు ఈ ర్యాలీలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఎంపీల నిరసనతో రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/drug-bust-three-arrested-at-delhi-airport-rs-60-lakh-foreign-marijuana-seized/national/528871/

అఖిలేష్ యాదవ్ అర్హతలు?

అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి పర్యావరణ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు.

అఖిలేష్ యాదవ్ ఎన్ని రోజులు సీఎంగా ఉన్నారు?

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ 2012 నుండి 2017 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు; 38 సంవత్సరాల వయస్సులో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు.

అఖిలేష్ యాదవ్ నిర్మించిన హైవే ఏది?

నవంబర్ 2015: లక్నో-అజంగఢ్-బల్లియా ఎక్స్‌ప్రెస్‌వేను పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేగా పేరు మార్చారు. ఫిబ్రవరి 2016: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎక్స్‌ప్రెస్‌వే కోసం ₹1,500 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2016: అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 22 డిసెంబర్ 2016న లక్నో-అజంగఢ్-బల్లియా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేశారు.

akhilesh yadav Breaking News Delhi protest latest news opposition MPs Parliament March Telugu News Voter Revision Bihar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.