📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Latest Telugu news : Akhilesh Yadav : యోగి ఆదిత్యనాథ్‌ చొరబాటుదారుడు.. అఖిలేష్ యాదవ్

Author Icon By Sudha
Updated: October 13, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చొరబాటుదారుడని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌ నుంచి వచ్చిన ఆయనను అక్కడకు పంపాలని అన్నారు. ఆదివారం రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా లక్నోలోని లోహియా పార్క్‌ను అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

Akhilesh Yadav : యోగి ఆదిత్యనాథ్‌ చొరబాటుదారుడు.. అఖిలేష్ యాదవ్

కాగా, వలసదారులకు సంబంధించి బీజేపీ వద్ద నకిలీ గణాంకాలున్నాయని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) విమర్శించారు. ‘కొందరు వ్యక్తులు వలసల గణాంకాలు ఇస్తున్నారు. మనకు కూడా యూపీలో చొరబాటుదారులు ఉన్నారు. ముఖ్యమంత్రి (ఆదిత్యనాథ్) ఉత్తరాఖండ్‌కు చెందినవారు. మేం ఆయనను ఉత్తరాఖండ్‌కు పంపాలనుకుంటున్నాం. బీజేపీలో చొరబాటుదారులు ఉన్నారా లేదా చెప్పండి మరి?’ అని అన్నారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సభ్యుడు కాదని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ‘ఆయన (ఆదిత్యనాథ్) చొరబాటుదారుడే కాదు. సైద్ధాంతిక కోణంలో కూడా చొరబాటుదారుడు. ఆయన బీజేపీ సభ్యుడు కాదు. మరొక (పార్టీ) సభ్యుడు. కాబట్టి, ఈ చొరబాటుదారులను ఎప్పుడు తొలగిస్తారు?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

అఖిలేష్ యాదవ్ ఎన్ని రోజులు సీఎంగా ఉన్నారు?

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ 2012 నుండి 2017 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు; 38 సంవత్సరాల వయసులో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడు. మాయావతి, అఖిలేష్ యాదవ్ మరియు యోగి ఆదిత్యనాథ్ అనే ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే ఐదు సంవత్సరాల అధికారిక పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.

అఖిలేష్ యాదవ్ డిగ్రీ?

ఆయన రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లోని ధోల్‌పూర్ మిలిటరీ స్కూల్‌లో విద్యనభ్యసించారు, తరువాత భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి పర్యావరణ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :https://epaper.vaartha.com/

Read Also:

akhilesh yadav BJP Breaking News latest news Political Controversy Samajwadi Party Telugu News Uttar Pradesh politics Yogi Adityanath

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.