📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Akhilesh Yadav: యోగి ఆదిత్యనాథ్ పై అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sushmitha
Updated: November 5, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య వ్యక్తిగత దూషణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,(Rahul Gandhi) సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.

Read Also: Hyd Crime:మాజీ భార్య పన్నాగంతో భర్త కిడ్నాప్‌ – రూ.22 కోట్ల స్థల వివాదం

Akhilesh Yadav

‘అప్పు, పప్పు, తప్పు’: యోగి ఎద్దేవా

ముజఫరాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఈ ముగ్గురిని ఎద్దేవా చేస్తూ వారిని ‘అప్పు, పప్పు, తప్పు’ (తేజస్వి, రాహుల్, అఖిలేశ్(Akhilesh) లను ఉద్దేశించి) అంటూ సంబోధించారు. గాంధీజీ చెప్పిన మూడు కోతులు చెడు మాట్లాడొద్దని, చెడు వినొద్దని, చెడు చూడొద్దని చెబుతాయని, కానీ బీహార్‌లో ఉన్న ఈ మూడు కోతులు మాత్రం రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెబుతూ మభ్యపెట్టి తిరిగి ‘జంగిల్ రాజ్’ పాలనను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

యోగి వ్యాఖ్యలపై అఖిలేశ్ ఫైర్

యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, ఎన్డీయే కూటమిలోని బీజేపీ తరచుగా గాంధీజీ చెప్పిన మూడు కోతులను గుర్తుచేసుకోవడానికి ప్రధాన కారణం కీలక అంశాల పైనుంచి ప్రజలను డైవర్ట్ చేయడమేనని ఆరోపించారు. “నిజానికి ఆయన (యోగి ఆదిత్యనాథ్)ను కోతుల గుంపు మధ్య కూర్చోబెడితే నువ్వు కానీ, నేను కానీ గుర్తుపట్టలేం” అంటూ అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

akhilesh yadav Bihar Elections Gandhi Three Monkeys Google News in Telugu India alliance Latest News in Telugu NDA alliance political criticism Telugu News Today Uttar Pradesh CM Yogi Adityanath

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.