మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక దర్యాప్తు కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బారామతిలో తీవ్ర పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విమానాన్ని పూణేకు మళ్లించే అవకాశం ఉన్నప్పటికీ పైలట్ బారామతిలోనే ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ తప్పుడు నిర్ణయమే ప్రమాదానికి దారి తీసిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Read also: Employees: EPFO వేతన పరిమితిని రూ. 25 వేలకు పెంచే యోచనలో కేంద్రం
Those two are the only reasons for the plane crash
ప్రతికూల వాతావరణమే కారణం
మొదటి ప్రయత్నంలో రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్లు ‘గో అరౌండ్’ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించిన సమయంలో విమానం వేగం, పొజిషన్ సరిగా లేకపోవడంతో చివరి నిమిషంలో కరెక్షన్ చేయడానికి యత్నించారు. అయితే ఆ ప్రయత్నం విఫలమై విమానం కూలిపోయిందని తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ డేటా ప్రకారం ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు పైలట్లు “ఓ షిట్” అని అరవడం రికార్డ్ అయింది. అంటే ప్రమాదాన్ని ఊహించినప్పటికీ తప్పించుకోలేకపోయారని అధికారులు భావిస్తున్నారు. అలాగే విమానంలో ఆధునిక గగన్ నావిగేషన్ వ్యవస్థ లేకపోవడం కూడా సమస్యగా మారినట్లు సమాచారం.
పైలట్ నిర్ణయంపై ఏఏఐబీ ఫోకస్
మరోవైపు అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్‌లో వేలాది మంది అభిమానులు, కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి. ఆయన కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్ చితికి నిప్పు అంటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, శరద్ పవార్, సుప్రియ సూలే తదితర ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. రాజకీయ కుట్ర ఆరోపణలను శరద్ పవార్ ఖండించారు. అజిత్ పవార్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: