మహారాష్ట్రలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందినట్లు వెల్లడైంది. బారామతి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో లియర్ జెట్ 45 విమానం కుప్పకూలింది. ప్రమాదానికి క్షణాల ముందు కాక్‌పిట్‌లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలుస్తోంది. పైలట్ల చివరి మాటలు “ఓ షిట్”గా నమోదైనట్లు డీజీసీఏ తెలిపింది.
Read also: India: గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి
The pilots’ last words before the plane crashed.
కాక్‌పిట్‌లో చివరి క్షణాలు
విమానంలో 15,000 గంటల అనుభవం ఉన్న సీనియర్ పైలట్ సుమిత్ కపూర్, 1,500 గంటల అనుభవం ఉన్న ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ ఉన్నారు. ముంబయి నుంచి ఉదయం 8.18 గంటలకు బయలుదేరిన ఈ విమానం బారామతి చేరుకుంది. తొలి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్‌వే స్పష్టంగా కనిపించక గో-అరౌండ్ చేశారు. రెండోసారి రన్‌వే కనిపిస్తోందని పైలట్లు ఏటీసీకి తెలియజేశారు. దీంతో 8.43 గంటలకు ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చారు.
ప్రమాద కారణంపై దర్యాప్తు
విమానయాన నిబంధనల ప్రకారం ఏటీసీ ఇచ్చిన ఆదేశాలను పైలట్లు రీడ్‌బ్యాక్ ఇవ్వాలి. కానీ ల్యాండింగ్ అనుమతి తర్వాత పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కేవలం ఒక నిమిషం తర్వాత రన్‌వే ప్రారంభంలో మంటలు ఎగసిపడటాన్ని ఏటీసీ గుర్తించింది. వెంటనే విమానం కుప్పకూలినట్లు నిర్ధారించారు. సహాయక సిబ్బందిని తక్షణమే రంగంలోకి దించారు
పైలట్ల చివరి మాటలు చూస్తే
ప్రమాద స్థలాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రత్యేక బృందం పరిశీలించింది. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. టేబుల్‌టాప్ రన్‌వే కావడంతో ల్యాండింగ్ లోపమా లేదా సాంకేతిక వైఫల్యమా అనే కోణంలో విచారణ జరుగుతోంది. పైలట్ల చివరి మాటలు చూస్తే చివరి క్షణంలో నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక త్వరలో వెలువడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: