📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Ajit Pawar: ఎట్టకేలకు దొరికేసిన ‘బ్లాక్ బాక్స్’.. కొనసాగుతున్న దర్యాప్తు  

Author Icon By Saritha
Updated: January 29, 2026 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో సంచలనం రేపిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ (Ajit Pawar) విమాన ప్రమాద దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బారామతిలో బుధవారం ఉదయం కుప్పకూలిన లియర్ జెట్ 45 విమానానికి సంబంధించిన ‘బ్లాక్ బాక్స్’ను పరిశోధక బృందాలు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నాయి. ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత.. సంఘటనా స్థలంలోనే ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్లు అధికారులు చెబుతున్నాయి. అయితే ఈ బ్లాక్ బాక్స్.. అజిత్ పవార్ సహా ఐదుగురి ప్రాణాలు పోవడానికి ముందు 11 నిమిషాల పాటు ఏం జరిగిందో చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Indian Officer: అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

ప్రమాదంలో సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా?

సాధారణంగా విమానాల్లో (Ajit Pawar) రెండు రకాల రికార్డర్లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR). ఇది విమానం ఎత్తు, వేగం, ఇంజిన్ పనితీరు వంటి సాంకేతిక అంశాలను నమోదు చేస్తుంది. రెండోది కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR). ఇది పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను రికార్డ్ చేస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం ఇప్పుడు ఈ రెండింటినీ క్షుణ్ణంగా విశ్లేషించనుంది. దీని ద్వారానే విమానం కూలిపోవడానికి ముందు సాంకేతిక లోపం తలెత్తిందా లేక మానవ తప్పిదమా అనే దానిపై స్పష్టత వస్తుంది.

ముంబయి నుంచి బారామతికి బయల్దేరిన అజిత్ పవార్ విమానం రన్‌వే కనిపించకపోవడంతో మొదట ‘గో-అరౌండ్’ చేయబడింది. 8:43 గంటలకు ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, 8:44 గంటలకు రన్‌వే ప్రారంభంలో మంటలు ఎగసిపడ్డాయి. కాక్‌పిట్ నుంచి చివరి మాటలు “ఓ షిట్” అని వినిపించాయి. అంటే ప్రమాదాన్ని ముందే ఊహించిన పైలట్లు దానిని ఆపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అర్థమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ajit pawar aviation safety Black box Investigation Latest News in Telugu Learjet 45 Maharashtra Plane crash Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.