📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ajit Doval : భారత్‌-చైనా మధ్య శాంతియుత వాతావరణం: అజిత్‌ దోవల్

Author Icon By Sudha
Updated: August 19, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ – చైనా (India – China) దేశాల మధ్య సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ (Ajit Doval) అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన తొలగినప్పటి నుంచి రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొందని, దీనివల్ల రెండు దేశాలూ ప్రయోజనం పొందాయని దోవల్ పేర్కొన్నారు.సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మంగళవారం అజిత్‌ దోవల్ (Ajit Doval)భేటీ అయ్యారు. ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో 24వ విడత చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు కొన్ని రోజుల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాలోని టియాన్జిన్‌లో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు జరగనుంది.

Ajit Doval : భారత్‌-చైనా మధ్య శాంతియుత వాతావరణం: అజిత్‌ దోవల్

ఆ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని దోవల్ (Ajit Doval)ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు చాలా కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా భారత్-చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయని అజిత్ దోవల్ తెలిపారు. ‘సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి. శాంతి, సామరస్యం నెలకొన్నాయి. మన ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి. గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భేటీ తర్వాత ఈ కొత్త వాతావరణం ఏర్పడింది. అప్పటి నుంచి ఇరు దేశాలు ఎంతో లబ్ధి పొందాయి’ అని దోవల్ చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా రెండు దేశాల సంబంధాల్లో ఎదురైన ఆటుపోట్లు ఎవరికీ మంచివి కావని అన్నారు. గత ఏడాది మోదీ, జిన్‌పింగ్ భేటీ ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి సరైన దిశానిర్దేశం చేసిందని, సరిహద్దు సమస్య పరిష్కారానికి ఊతమిచ్చిందని తెలిపారు. ‘సరిహద్దుల్లో ఇప్పుడు నెలకొన్న స్థిరత్వం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రధాని మోదీ మా ఆహ్వానం మేరకు ఎస్‌సీఓ సదస్సు కోసం చైనాకు రానుండటాన్ని మేం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా 2020 ఏప్రిల్-మే నెలల్లో లఢక్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద మొదలైన సైనిక ప్రతిష్టంభన, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా ఇరు దేశాల సంబంధాలు ఆరు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. 2024 అక్టోబర్ 21న ప్రతిష్టంభనకు తెరపడటంతో ఆ తర్వాత రెండు రోజులకే మోదీ-జిన్‌పింగ్ కజాన్‌లో సమావేశమై సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని నిర్ణయించారు. తాజా చర్చల్లో సరిహద్దుల్లో నమ్మకాన్ని పెంచే చర్యలపై కూడా దృష్టి సారించనున్నారు. ఈ పర్యటన ఆఖరులో వాంగ్ యీ ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నారు.

అజిత్ దోవల్ ఐఏఎస్ అధికారి?

2014 నుండి భారత జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నారు. ఆయన కేరళ కేడర్ నుండి ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) నుండి రిటైర్డ్ అధికారి, దోవల్ గతంలో 2004 నుండి 2005 వరకు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవిని నిర్వహించారు, ఒక దశాబ్దానికి పైగా దాని కార్యకలాపాల విభాగానికి నాయకత్వం వహించారు.

అజిత్ దోవల్ పోస్టు?

2024 నుండి, దోవల్ వరుసగా మూడవసారి జాతీయ భద్రతా సలహాదారుగా ఐదు సంవత్సరాలు పనిచేస్తున్నారు, దీనితో భారత చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన NSAగా ఆయన నిలిచారు. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/india-pakistan-war-vs-russia-ukraine-conflict/international/532741/

Ajit Doval Breaking News Diplomacy india India China Relations International Relations Peace Talks Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.