📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News : Aishwarya Rai Bachchan : సత్యసాయి బాబా నిరంతరం పేదల కోసం తపించేవాఋ.. ఐశ్వర్యరాయి బచ్చన్‌

Author Icon By Sudha
Updated: November 19, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భగవాన్‌ సత్యసాయి బాబా నిరంతరం పేదల కోసం తపించేవారని ప్రముఖ నటి ఐశ్వర్యరాయి బచ్చన్‌ (Aishwarya Rai Bachchan) అన్నారు. సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం సత్యసాయి జిల్లాలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్ , కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయి (Aishwarya Rai Bachchan)మాట్లాడుతూ భగవంతుడికి, ప్రజలకు సేవ చేయడమేనని నిజమైన నాయకత్వ లక్షణమని బాబా భావించేవారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి క్రమ శిక్షణ, అంకితభావం, దైవత్వం, దృఢ సంకల్పం కలిగి ఉండాలని బోధించేవారని తెలిపారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే కాకుండా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ప్రజలకు సైతం తాగునీరు, వైద్య సహాయం, ఉచితంగా విద్యాభ్యాసంలాంటి ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు.

Read Also : Puttaparthi: సత్యసాయి సమాధి వద్ద PM Modi ప్రత్యేక పూజలు

Aishwarya Rai Bachchan

సత్యసాయి జన్మించి వందేళ్లు గడిచాయని, ఆయన భౌతికంగా లేకపోయినా సేవా కార్యక్రమాలు, భోదనల ద్వారా ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉంటారని అన్నారు. విద్యా ట్రస్టుల ద్వారా విద్యార్థులకు ఉన్నత విలువలు బోధించారని వెల్లడించారు. పుట్టపర్తి, బెంగళూరు, నవీ ముంబైలల్లోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా అంతర్జాతీయ వైద్య సేవలను ఉచితంగా అందించారని తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aishwarya Rai Bachchan bollywood Breaking News Indian actress latest news Sathya Sai Baba Spiritual Leaders Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.