ఒకప్పుడు ఘాటుగా ప్రతిపాదించిన Pakistan వాదనలు ఇప్పుడు విచిత్రంగా మారాయి.‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేసిన దాడుల్ని మొదట తిరస్కరించిన పాకిస్తాన్, ఇప్పుడు నిజాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.భారత దళాలు పాకిస్తాన్‌లోని కీలక ఎయిర్‌బేస్‌లు, మిలటరీ స్థావరాలపై జరిపిన స్ట్రైక్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.అంతర్జాతీయ మీడియా ఆ దాడులను భారత్ విజయంగా ప్రకటించింది. న్యూయార్క్ టైమ్స్ శాటిలైట్ ఫోటోలు కూడా ఇదే చెబుతున్నాయి.ఈ ఫోటోలు దాడికి ముందు, తరువాత జరిగిన మార్పులను స్పష్టంగా చూపిస్తున్నాయి.పాక్ చెప్పిన అడ్డగోలు వాదనలకు ఇవి ధీటైన సమాధానం అందించాయి.
పలు ఎయిర్‌ఫీల్డ్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి.ఇంతకీ పాకిస్తాన్ ఏం చేసిందంటే? మొదట దాడులు లేవని చెప్పింది.తర్వాత టెండర్లు పిలిచింది.రావల్పిండి, కల్లర్ కహర్, రిసాల్‌పూర్ లాంటి మిలటరీ బేస్‌లలో మరమ్మత్తులు చేపట్టేందుకు ప్రణాళికలు మొదలుపెట్టింది.అంటే భారత దాడులు నిజమే అని పరోక్షంగా ఒప్పుకున్నట్టే.భారత దాడుల ప్రాముఖ్యతను వాషింగ్టన్ పోస్ట్ కూడా వెల్లడించింది.కనీసం ఆరు పాక్ ఎయిర్‌బేస్‌ల రన్‌వేలు ధ్వంసమయ్యాయని తెలిపింది. మిలటరీ స్ట్రక్చర్లు నేలమట్టమయ్యాయని వివరించింది.ఈ దాడుల తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. నాలుగు రోజుల పాటు ఎయిర్‌స్ట్రైక్స్, డ్రోన్ దాడులతో రెండు దేశాలు ఎదుర్కొన్నాయి.
అయితే, భారత దాడులు తక్కువ సమయంలో, గరిష్టంగా నష్టం కలిగించాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.వీటిపై లండన్ కింగ్స్ కాలేజ్ సీనియర్ లెక్చరర్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. “1971 తర్వాత భారత్ ఇలా విస్తృత స్థాయిలో దాడులు జరపడం ఇదే మొదటిసారి,” అన్నాడు.ఇది అంతరాష్ట్ర స్థాయిలో అపూర్వ ఘటన అని అన్నారు.ఇంతవరకు దాడులకు సంబంధించి పాక్ ఇచ్చిన వర్ణనలు ఇప్పుడు తేలిపోయాయి.వాస్తవాలు బయటపడటంతో ప్రపంచం పాక్ వైఖరిపై ఆశ్చర్యపడుతోంది. భారత్ వినూత్నంగా దాడి చేసిన తీరును పొగడ్తలు అందుతున్నాయి.పాక్ మాత్రం ఇది చిన్నపాటి దాడి అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ శాటిలైట్ ఫోటోలు, అంతర్జాతీయ మీడియా కథనాలు వాస్తవాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నాయి.ఈ దాడుల ప్రభావం అంతటా కనిపిస్తోంది. రణరంగంలో కాదు, డిప్లొమసీలోనూ భారత్ పైచేయి సాధించింది. పాక్ బలహీనత ప్రపంచానికి బయటపడిపోయింది.
Read Also : H 1B Visa : హెచ్-1బీ వీసాలపై భారతీయ అమెరికన్ షాకింగ్ పోస్టు..