సౌరశక్తి లక్ష్యాలకు భారీ దెబ్బ
హైదరాబాద్: సౌర శక్తి రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని లక్ష్యాలను నిర్ణయించుకుని సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భారత్కు(Air Pollution) వాతావరణ కాలుష్యం రూపంలో సరికొత్త సవాల్ ఎదురవుతోంది. గడచిన మూడు దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా సూర్యరశీ భూమిని తాకే సమయం (ఎండ గంటలు) క్రమంగా తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడయ్యింది. వాము కాలుష్యానికి తోడు, వీటి వల్ల ఏర్పడుతున్న ధూళి, దీని కారణంగా భూమిపై సరిగ్గా వర్షించలేక ఆగిపోతున్న దట్టమైన మేఘాలు, దీనికి తోడుగా ఆయా ప్రాంతాలలోని వాతావరణ పరిస్థితులు వీటన్నింటికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ పరిణామాలు దేశ సౌరశక్తి(Solar energy) లక్ష్యాలతో పాటు వ్యవసాయ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం వుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
భారత్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు వాతావరణ శాఖకు చెందిన ఆరుగురు శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఈ అధ్యయన వివరాలను ప్రఖ్యాత సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యింది. బనారస్ హిందూ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజి, భారత వాతావరణ శాఖకు చెందిన సైంటిస్టులు 1998 నుంచి 2018 వరకు 20 ఏళ్ల కాలంలో దేశంలోని 20 వాతావరణ కేంద్రాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. ఈ విశ్లేషణలో సంచలన విషయాలను వారు వెలుగులోకి తెచ్చారు.
ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప మినహాయింపులు వున్నప్పటికీ దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ఏటా సూర్యరశ్మి గంటలు తగ్గుతున్నట్లు వారి పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఉత్తర భారతంలోని అమృత్సర్, ఢిల్లీ, హిమాయల పర్వతాలు, తూర్పున వున్న కోల్కతా, పశ్చిమాన వున్న ముంబాయి, గుజరాత్ సహా ఇతర ప్రాంతాలలో ఈ తగ్గుదల అత్యధికంగా వుందని సైంటిస్టుల పరిశోధనలో తేలింది.
Read also: జాతి వివక్షతో భారతీయు యువతిపై అత్యాచారం
కాలుష్య నియంత్రణ చట్టాల అవసరంపై శాస్త్రవేత్తల హెచ్చరిక
గాలిలో తేలియాడే అతి సూక్ష్మ ధూళి కణాలు (ఏరో సోల్స్) ఈ సమస్యకు మూల కారణంగా వారు గుర్తించారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ, వంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఏరో సోల్స్ వాతావరణంలో(Air Pollution) ఎక్కువగా చేరుతోందని వారు తేల్చారు. దీనివల్ల నీటితో నిండి వుండే మేఘాలు ఎక్కువసేపు వర్ణించలేక పోతున్నాయని, దీని ఫలితంగా సూర్యరశ్మిని ఇవి మరింతగా అడ్డుకుంటున్నాయని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. ఈ పరిస్థితులు దేశ సౌర విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం వుందని వారంటున్నారు. వాయు కాలుష్యం వల్ల సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం ఇప్పటికే గరిష్టంగా 41 శాతం తగ్గిందని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే వీలుందని వారు హెచ్చరించసాగారు. దీనివల్ల ఏటా 245 మిలియన్ల నుంచి 835 మిలిమన్ డాలర్ల మేర విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లే ప్రమాదం వుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో దేశంలోని అత్యంత కలుషిత ప్రాంతాలలో వరి, గోధుమ వంటి పంటల దిగుబడి 36 శాతం నుంచి 50 శాతం వరకు పడిపోయే ప్రమాదం వుందని వారంటున్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా చేసుకోగా తగ్గుతున్న సూర్యరశ్మి గంటల కారణంగా ఈ లక్ష్యానికి తూట్లు పడే ప్రమాదం వుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని యూరప్ దేశాలతో పాటు చైనాలోనూ ఈ సమస్య వున్నా అక్కడి కఠినమైన కాలుష్య నియంత్రణ చట్టాల వల్ల సమస్యను చాలా వరకు నియంత్రించబడ్డాయని వారంటున్నారు. భారత్లో ఆ తరహా చట్టాలు వస్తే తప్ప సౌరశక్తి లక్ష్యాలను సాధించడం కష్టమని సైంటిస్టులు చెబుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: