📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Air India : సాంకేతిక లోపాలతో ఎయిరిండియా..మరో విమానం రద్దు

Author Icon By Divya Vani M
Updated: August 3, 2025 • 11:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎయిరిండియా (Air India) విమానాల్లో సాంకేతిక లోపాలు, రద్దులు ఆగడం లేదు. తాజాగా, సింగపూర్ నుంచి చెన్నై (Singapore to Chennai) కి రావాల్సిన విమానం రద్దయింది. AI349 నంబరుతో ప్రయాణించాల్సిన ఈ అంతర్జాతీయ విమానాన్ని టేకాఫ్‌కు ముందే సాంకేతిక లోపం వల్ల నిలిపివేశారు.టేకాఫ్‌కు కొన్ని క్షణాల ముందు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. ఈ లోపం తక్షణం పరిష్కారమయ్యేలా లేదు.దీంతో ప్రయాణికుల భద్రత దృష్టిలో ఉంచుకుని విమానాన్ని రద్దు చేశామని ఎయిరిండియా అధికారికంగా ప్రకటించింది.ఈ అకస్మాత్తు నిర్ణయం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. చెన్నై వెళ్లాల్సిన వారు ఎటూ పోలేక ఏమీ చేసుకోలేని పరిస్థితి.విమానంలో ఉన్నవారిని ప్రత్యామ్నాయంగా పంపించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లుఎయిరిండియా.తెలిపింది.ప్రయాణికుల కోసం హోటల్ వసతి ఏర్పాటు చేసినట్టు సంస్థ వివరించింది. అలాగే టికెట్ డబ్బును పూర్తి రీఫండ్‌ చేయడం,లేదా ఉచితంగా మరో విమానంలో రీషెడ్యూల్ చేసే సదుపాయం కల్పిస్తున్నామని ప్రకటించారు.

Air India : సాంకేతిక లోపాలతో ఎయిరిండియా..మరో విమానం రద్దు

సిబ్బంది సహాయం చేస్తోంది – ఎయిరిండియా

సింగపూర్‌లోని సిబ్బంది ప్రయాణికులకు సహాయంగా నిలుస్తున్నారని ఎయిరిండియా పేర్కొంది.ఈ సమస్య వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు.గత కొద్ది వారాలుగా ఎయిరిండియా విమానాలు వరుసగా సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలుస్తున్నాయి.లండన్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానం 11 గంటల ఆలస్యం కావడం,దాని ముందు ఢిల్లీ నుంచి లండన్ వెళుతున్న విమానం టేకాఫ్‌కు ముందే తిరగదొర్లడం వంటి ఘటనలు మరచిపోలేను.

DGCA తనిఖీలు – 51 లోపాలు బయటపడ్డవు

ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్వహించిన తనిఖీల్లో 51 భద్రతా లోపాలు గుర్తించారు.ఇవి చిన్నచిన్నవి కాదు. పైలట్లకు అసంపూర్తిగా శిక్షణ, గడువు ముగిసిన మాన్యువల్స్,నాణ్యత లేని సిమ్యులేటర్లు అన్నీ ప్రమాదకరమైన అంశాలే.మిగతా 44ను ఆగస్టు 23లోపు పూర్తిచేయాలని DGCA ఆదేశించింది.ఈ హెచ్చరికల నేపథ్యంలో కూడా ఇకపై కూడా ఇలాంటి ఘటనలు జరగడం ప్రయాణికుల్లో గభాలింపుని కలిగిస్తోంది.

ప్రయాణికుల నమ్మకానికి దెబ్బతొస్తోందా?

ఎయిరిండియాను ఎంచుకునే ప్రయాణికుల సంఖ్య భారీగానే ఉంటుంది.అయితే ఇప్పుడు సాంకేతిక లోపాలు, ఆలస్యాలు, రద్దులు.ఈ సంస్థపై నమ్మకాన్ని దెబ్బతీసేలా మారుతున్నాయి.అధికారులు ఈ అంశాన్ని గంభీరంగా తీసుకుని తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read Also : Chiranjeevi : రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

AI349 Cancelled Flight Reason Air India DGCA Safety Report Air India Flight Delay News Air India Passenger Trouble Air India Technical Issue Singapore to Chennai Flight Cancelled

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.