ఎయిర్ ఇండియాలో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఇండియాలో దశాబ్దాలుగా సాగుతున్న ఒక అక్రమ దందా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సంస్థ ఉద్యోగులకు లభించే ఫ్రీ ప్యాసేజ్ (Free Passage) సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ, వేల సంఖ్యలో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. సుమారు 4,000 మంది ఉద్యోగులు తమకు కేటాయించిన ఉచిత టిక్కెట్లను బయటి వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు అంతర్గత విచారణలో వెల్లడైంది. దర్యాప్తు తర్వాత ఎయిర్ ఇండియా(Air India) మోసానికి పాల్పడిన ఉద్యోగులపై చర్యలకు సిద్ధపడింది.
Read Also: Gas Shortage: హైదరాబాద్‌లో గ్యాస్ సంక్షోభం..ప్రతిరోజూ కోట్లలో నష్టం

టిక్కెట్లను భారీ ధరలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది
విమానయాన సంస్థలు తమ సిబ్బందికి ప్రోత్సాహకంగా ఏడాదికి కొన్ని ఉచిత టిక్కెట్లను ఇస్తాయి. ఇవి కేవలం ఉద్యోగికి లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ, ఎయిర్ ఇండియాలోని కొందరు సిబ్బంది ఏజెంట్లతో కుమ్మక్కై, ఈ టిక్కెట్లను అపరిచితులకు విక్రయించారు. విదేశీ ప్రయాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిక్కెట్లను భారీ ధరలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా బాధ్యతలను టాటా గ్రూప్ స్వీకరించిన తర్వాత, సంస్థలోని ప్రతి విభాగాన్ని డిజిటలైజ్ చేస్తూ పారదర్శకతను పెంచుతోంది. ఈ క్రమంలోనే పాత రికార్డులను, టిక్కెట్ బుకింగ్ విధానాలను పరిశీలించగా ఈ భారీ అవకతవకలు బయటపడ్డాయి. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందా వల్ల సంస్థ ఆదాయానికి గండి పడటమే కాకుండా, నైతిక విలువలు దెబ్బతిన్నాయని యాజమాన్యం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: