Air India, AI 185: ఎయిరిండియా ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఢిల్లీ నుంచి కెనడాలోని వాంకోవర్‌కు బయలుదేరిన AI 185 విమానం, సుమారు 8 గంటల పాటు గాల్లో ప్రయాణించిన తర్వాత తిరిగి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. విమానయాన అనుమతులకు సంబంధించిన సాంకేతిక కారణాలే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
Read Also: Tamil Nadu Elections : తమిళనాడులో AIADMKదే పైచేయి?
వివరాల్లోకి వెళ్తే.. ఎయిరిండియాకు చెందిన AI 185 విమానం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం 11.34 గంటలకు ప్రయాణికులతో బయలుదేరింది. గతేడాది అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం కాసేపటికే సాంకేతిక లోపంతో కూలిపోయిన సంగతి తెలిసిందే. తరుచూ ఇలాంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.కానీ, ఇది చైనా గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత ఆ విమానానికి కెనడాలో అనుమతి లేదని అధికారులు తమ గుర్తించారు.
తక్షణమే వెనక్కి విమానాన్ని తీసుకురావాలని పైలట్లను ఆదేశించారు. దీంతో విమానం ఢిల్లీకి యూటర్న్ తీసుకుని, దాదాపు 8 గంటల తర్వాత టేకాఫ్ అయిన చోటే మళ్లీ దిగింది. ఈ ప్రయాణానికి బోయింగ్ 777-200LR విమానాన్ని ఉపయోగించగా.. కెనడాలో బోయింగ్ 777-300ER శ్రేణి విమానాలకు మాత్రమే అనుమతి ఉంది. పలు దేశాల విమానయాన అనుమతులను విభిన్న ప్రమాణాల ఆధారంగా ఉంటాయి.
Air India, AI 185: స్పందించిన ఎయిరిండియా
ఈ ఘటనపై ఎయిరిండియా ఓ ప్రకటన విడుదల చేస్తూ.. దీనికి ఆపరేషనల్ సమస్య కారణమని తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండయ్యిందని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపింది. ఈ అసౌకర్యానికి తాము క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. అంతేకాదు, ప్రయాణికులకు హోటల్ వసతి వంటి సౌకర్యాలు కల్పించి, వారిని వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: