ఎయిర్ ఇండియా Air India విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ (CEO Campbell Wilson) స్పందించారు. సంస్థ ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఏఐ 171 విమాన ప్రమాదానికి సంబంధించిన విషయాలను ఒక లేఖ ద్వారా క్యాంప్‌బెల్ వివరించారు. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భూమిపై ఉన్న 34 మంది పౌరులు కూడా మరణించారు. ఇది మానవాళికి తీరని నష్టం, అంటూ ఆయన అన్నారు.
సిబ్బంది అనుభవంపై వివరాలు
దుర్ఘటన జరిగిన సమయంలో విమానాన్ని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ నడిపిస్తున్నారు. ఆయనకు 10,000 గంటల పైగా ఫ్లయింగ్ అనుభవం ఉంది. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్‌కు కూడా 3,400 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉందని కంపెనీ తెలిపింది.విమానం ఇంజిన్లను 2025లో చివరిసారిగా చెక్ చేశారు. ఏమీ సాంకేతిక లోపాలు గుర్తించబడలేదని సంస్థ స్పష్టం చేసింది. అయినా జాగ్రత్త చర్యలుగా 33 బోయింగ్ 787 విమానాల భద్రతా పరిశీలన ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు 26 విమానాలు సురక్షితమని తేలిందని వివరించారు.
ఫ్లైట్ క్యాన్సిలేషన్‌కి కారణాలు
మిడిల్ ఈస్ట్ ఎయిర్‌స్పేస్ క్లోజర్, నైట్ రిస్ట్రిక్షన్స్ కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్ 20 నుంచి జూలై మధ్య వరకు ఇంటర్నేషనల్ వైడ్‌బాడీ ఫ్లైట్స్‌ను 15 శాతం తగ్గించనున్నామని చెప్పారు.ఫ్లైట్స్ రద్దయిన సందర్భంలో ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదా రీబుకింగ్ ఎంపికలు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.
Read Also : Israel Iran :భయం నీడలో టెహ్రాన్ ప్రజలు- ఇంటర్నెట్ సర్వీసులు బంద్