📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం

Nirmala Sitharaman: వెండి ధరల పెరుగుదలపై కేంద్రానికి AIJGF లేఖ

Author Icon By Vanipushpa
Updated: January 24, 2026 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు ఇటీవల అకస్మాత్తుగా భారీగా పెరగడం దేశవ్యాప్తంగా లోహాల రంగంలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ముఖ్యంగా వెండి ఫ్యూచర్స్ ధరలు అంతర్జాతీయ స్పాట్ ధరలు, దేశీయ బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే నమ్మశక్యం కాని రీతిలో ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయనే అంశం పరిశ్రమ వర్గాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా జ్యువెలర్స్ & గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ (AIJGF) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జనవరి 21న ఒక లేఖ రాసింది. అందులో తమ ఆందోళనలను స్పష్టంగా తెలియజేసింది. MCXలో Silver కాంట్రాక్టులు ప్రస్తుత స్పాట్ లేదా బెంచ్‌మార్క్ ధరలతో పోలిస్తే దాదాపు కిలోకు రూ.40 వేల వరకు అధికంగా ట్రేడవుతున్నాయని లేఖలో AIJGF పేర్కొంది. ఇది సాధారణ మార్కెట్ డిమాండ్-సప్లై పరిస్థితులతో సమర్థించలేనంతగా ఉందని.. తీవ్రమైన, ఆకస్మిక ధరల స్థానభ్రంశం జరుగుతోందని ఫెడరేషన్ అభిప్రాయపడింది.

Read Also: Gold price today : రూ.2 లక్షల దిశగా బంగారం? వెండి కూడా షాక్!

Nirmala Sitharaman: వెండి ధరల పెరుగుదలపై కేంద్రానికి AIJGF లేఖ

రాజకీయ పరిణామాలతో వెండి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం

AIJGF జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా, జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ కేడియా సంతకం చేసిన ఈ లేఖలో.. వెండి (Silver) పై దిగుమతి సుంకాలు పెరగవచ్చనే పుకార్లు ఈ ధరల పెరుగదలకి ప్రధాన కారణమై ఉండవచ్చని ఆరోపించారు. ఈ రూమర్లు మార్కెట్‌లో అతి వేగంగా వ్యాప్తి చెంది.. ఊహాగానాల ఆధారంగా ట్రేడింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా వెండి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా యూరప్, మధ్యప్రాచ్యం, ఆర్కిటిక్ ప్రాంతాలకు సంబంధించిన రాజకీయ ప్రకటనలు, సురక్షిత ఆస్తుల వైపు పెట్టుబడిదారులను మళ్లించాయి. దీనివల్ల బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో అధిక అస్థిరత కనిపిస్తోంది. ఈ గ్లోబల్ ఫ్యాక్టర్లు దేశీయ మార్కెట్‌లో కూడా ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AIJGF letter bullion market Indian jewellery industry jewellery federation India Latest News in Telugu Precious metals prices silver market India Silver price rise Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.