బెంగళూరు:(Bangalore) ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్(Sadhaguru jaggi Vasudav) సద్గురు జగ్గీవాసుదేవ్ పేరిట ఎఐ విడియో.. మహిళకు రూ.3.75 కోట్ల టోకరా పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)(Artificial intelligence) వీడియోను రూపొందించిన సైబర్ నేరగాళ్లు, బెంగళూరులో ఒక మహిళను రూ.3.75 కోట్ల మేర మోసం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని సి.వి. రామన్ నగర్‌కు చెందిన వర్ష గుప్తా అనే మహిళ ఫిబ్రవరి 25న యూట్యూబ్(Youtube)చూస్తుండగా, సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు సంబంధించిన ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోలో, 250 డాలర్ల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేరితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సద్గురు చెబుతున్నట్లు ఉంది.
AI వీడియోతో మోసం
డీప్‌ఫేక్ టెక్నాలజీ(Technology) గురించి అవగాహన లేకపోవడంతో, ఆ వీడియో అసలైనదేనని నమ్మిన వర్ష గుప్తా, వీడియో కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేశారు. దీంతో ఆమెకు వలీద్ అనే వ్యక్తి ఫోన్ చేసి, తనను తాను మిరాక్స్ యాప్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. విదేశీ ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ ఉపయోగించి ఆమెతో మాట్లాడిన ఆ వ్యక్తి, మిరాక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాడు. ఆ తర్వాత మైఖేల్ అనే మరో వ్యక్తి కూడా ఆ యాప్‌ను నమ్మవచ్చని ఆమెకు భరోసా ఇచ్చాడు. వీరి మాటలను నమ్మిన వర్ష, పలు దఫాలుగా తన ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాలకు రూ.3.75 కోట్లను బదిలీ చేసింది. చివరికి ఆమె మిరాక్స్ యాప్ గురించి ఆరా తీయగా, అది నకిలీదని తెలిసి మోసపోయానని గ్రహించారు. దీంతో ఆమె బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
మోసానికి గురైన మహిళ ఎంత మొత్తం కోల్పోయారు?
ఆమె పలు దఫాలుగా రూ.3.75 కోట్లు మోసగాళ్లకు బదిలీ చేశారు.
ఈ మోసంలో ఏ సాంకేతికతను ఉపయోగించారు?
సద్గురు జగ్గీ వాసుదేవ్ ముఖాన్ని, గొంతును ఉపయోగించి ఏఐ డీప్‌ఫేక్ వీడియోను సృష్టించి మోసం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also:
News telugu: Renu Desai: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రేణూ దేశాయ్ వ్యాఖ్యలు