ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. చాట్ జీపీటీ (ChatGPT) నుంచి డ్రైవర్ లేని కార్ల వరకు ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా రాబోయే బడ్జెట్ (Budget 2026) లో ఏఐ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. అసలు భారత బడ్జెట్ అజెండాలో ఏఐ ఎందుకు టాప్ ప్లేస్ లో ఉందో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ (Economic Growth) భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంలో ఏఐ పాత్ర చాలా కీలకం. పరిశ్రమల్లో ఉత్పాదకతను పెంచడం ద్వారా జీడీపీ (GDP) కి ఏఐ భారీగా తోడ్పడుతుంది. అందుకే ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో ఏఐ స్టార్టప్‌లకు భారీగా ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంది. వ్యవసాయం & ఆరోగ్య రంగంలో విప్లవం భారత్ వంటి వ్యవసాయ ప్రధాన దేశంలో ఏఐ వినియోగం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వాతావరణ అంచనాలు, నేల సారం, పంట తెగుళ్లను గుర్తించడంలో ఏఐ సహాయపడుతుంది.
Read Also: Maharashtra Elections:ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి ముందంజ
అలాగే, హెల్త్‌కేర్ రంగంలో తక్కువ ఖర్చుతో రోగ నిర్ధారణ చేయడానికి ఏఐ టెక్నాలజీని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ ఇండియా 2.0 గత దశాబ్ద కాలంలో యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు అదే వేగంతో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించాలని కేంద్రం చూస్తోంది. ఇందుకోసం భారీ డేటా సెంటర్ల ఏర్పాటు, సూపర్ కంప్యూటర్ల అభివృద్ధికి ఈ సారి బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం దీనిని ఒక అవకాశంగా మార్చుకోవాలని చూస్తోంది. యువతకు ఏఐ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చి, సరికొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ఈ బడ్జెట్ ముఖ్య ఉద్దేశం. ‘మేక్ ఏఐ ఇన్ ఇండియా’ , ‘మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా’ అనే నినాదంతో విద్యా సంస్థల్లో ఏఐ కోర్సులకు బడ్జెట్ మద్దతు లభించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: