AI ImpactSummit: న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్పై కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నేత శశి థరూర్ ఈ సమిట్‌ను ప్రశంసిస్తూ, ప్రారంభ రెండు రోజులు ఎంతో విజయవంతంగా సాగాయని పేర్కొన్నారు. తన కొత్త పుస్తక లాంచ్ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన థరూర్, ఇలాంటి భారీ అంతర్జాతీయ ఈవెంట్లలో కొన్ని నిర్వహణ లోపాలు సహజమని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ, ఖర్గే విమర్శలు
అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సమిట్‌ను “అస్తవ్యస్తమైన ప్రదర్శన”గా అభివర్ణించారు. కార్యక్రమంలో చైనీస్ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే తరహాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర సీనియర్ నాయకులు కూడా సమిట్ నిర్వహణలో లోపాలున్నాయని విమర్శలు చేశారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: