📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AI Content: సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం షాక్

Author Icon By Aanusha
Updated: February 11, 2026 • 12:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించే కంటెంట్‌ (AI Content) పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ఏఐ ఆధారంగా రూపొందించిన కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికలపై ప్రచురించేటప్పుడు తప్పనిసరిగా లేబుల్ లేదా వాటర్ మార్క్ ఉండాలని కేంద్రం ఆదేశించింది.

Read Also: Manipur Violence: మణిపుర్‌లో మరోసారి అల్లర్లు

ఆటోమేటెడ్ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి

ఈ లేబుల్ సాధారణ యూజర్‌కు కూడా సులభంగా గుర్తించేలా ఉండాలని స్పష్టం చేసింది.ఒకసారి మార్క్ చేసి కంటెంట్, మెటా డేటాను తొలగించడం లేదా దానిని కనిపించకుండా చేయడానికి అవకాశం ఉండరాదదని తెలిపింది. చట్టవిరుద్ధమైన, అభ్యంతకరమైన, మోసపూరిత కంటెంట్‌ను నిరోధించేందుకు ఆటోమేటెడ్ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సోషల్ మీడియా వేదికలకు సూచించింది. ఏఐ కంటెంట్‌ (AI Content) ను దుర్వినియోగం చేస్తే జరిమానాలు, శిక్షల గురించి యూజర్లకు అవగాహన కల్పించాలని పేర్కొంది.

AI Content: Center shocks social media companies

ఏఐ జనరేటెడ్‌ లేదా డీప్‌ఫేక్‌ కంటెంట్‌ను తొలగించేందుకు కేంద్రం సోషల్ మీడియా సంస్థలకు గడువు కూడా విధించింది. ఏఐ కంటెంట్‌కు సంబంధించి ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశాలు జారీ చేసినప్పుడు దాన్ని 3 గంటల్లోనే తొలగించేలా చూడాలని సూచించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్‌ విపరీతంగా పెరిగిపోతోంది. ఏది ఒరిజినల్? ఏది ఏఐ కంటెంట్‌ ? అనేది గుర్తుపట్టలేనంతంగా మారిపోయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏఐ కంటెంట్‌ను గుర్తించేలా వాటర్‌ మార్క్‌ పెట్టాలని సోషల్ మీడియా సంస్థలకు ఆదేశించింది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AIGeneratedContent ArtificialIntelligence latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.