📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమెరికా బోర్డు అభిప్రాయం ఏంటి?

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనలో దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే,ఈ ప్రమాదానికి కారణం చెప్పేందుకు సమయం పడుతుంది. ఇదే విషయాన్ని అమెరికా బోర్డు స్పష్టంచేస్తున్నది. విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని యూఎస్ నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(ఎన్డీఎసీ) అభిప్రాయపడింది. ఇంధన స్విచ్లను కెప్టెన్ ఆఫ్ చేయడమే,ప్రమాదానికి కారణమని వస్తున్న వార్తన నేపథ్యంలో సేఫ్టీబోర్డ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఏడాది సమయం పట్టే అవకాశం?

ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ఎన్టీఎస్బీతో కలిసి భారత ఎయిర్క్రాప్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో విమాన ప్రమాదానికి గల కారణాలపై అప్పుడే ఒక,నిర్ణయానికి రావొద్దని ఏఏఐబీ, ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బఎల్ విల్సన్ ప్రజలను కోరారు. తుది నివేదిక,వచ్చేందుకు ఒక ఏడాది లలేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని స్పష్టం చేశారు.

Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమెరికా బోర్డు అభిప్రాయం ఏంటి?

ప్రాథమిక నివేదిక ప్రకారం..

బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన వెంటనే అందులోని రెండు ఇంధన నియంత్రణ స్విచ్లు ‘కటాఫ్’మోడ్లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా ఇంజిన్లలో ఇంధనం నిండుకుంది. ఇది జరిగిన పది సెకన్లలోనే,విమానం ప్రమాదానికి గురైంది. కాక్పిట్ వాయిస్ రికార్డును బట్టి ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందన్ మరో కెప్టెన్, సుమీత్ సభర్వాలోతో మాట్లాడుతూ ఇంధన స్విచ్లు కటాఫ్మెడ్లోకి ఎందుకు వెళ్లాయని ప్రశ్నించాడు. దానికి ఆయన నాకు తెలియదు అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం దీనిపైనే దర్యాప్తు జరుగుతున్నది. ఇంధన, స్విచ్లు ఎందుకు ఆఫ్ అయ్యాయన్న అంశంపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో242 మంది ప్రయాణీకులు మరణించగా,ఒకేఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా విమానం మెడికల్
హాస్టలపై పడడంతో 19 పిజీమెడికల్ విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన
యావత్ భారతదేశాన్ని తీవ్రదిభ్రాంతికి గురిచేయడం మాత్రమేకాక విదేశీయులు మరణించడంతో ఇతర దేశాలుసైతం ఆవేదన వ్యక్తం చేశాయి.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎంత మంది మృతి చెందారు?

2025 జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 260 మంది మృతి చెందారు.

భారతదేశంలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదం ఏది?

భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతి భారీ విమాన ప్రమాదాల్లో తాజా రికార్డు ప్రకారం, 2025 జూన్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విమాన ప్రమాదం అతి పెద్దదిగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Raj Thackeray: మరాఠీ భాషపై మరోసారి రాజాథాకరే తీవ్ర హెచ్చరికలు

Ahmedabad plane crash aircraft crash probe aviation accident Breaking News flight safety fuel switch off India aviation news latest news NTSB investigation Telugu News US National Transportation Safety Board

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.